Shah Rukh Khan Appears Before ED

Shah rukh khan appears before ed

Shah Rukh Khan, Shah Rukh Khan before ED, Shah Rukh Khan News, Shah Rukh Khan IPL, IPL, Shah Rukh Khan statements, Shah Rukh Khan contraversy

Bollywood superstar Shah Rukh Khan appeared before the Enforcement Directorate (ED) on Wednesday and recorded his statement in connection with the valuation of shares of his co-owned IPL cricket team, Kolkata Knight Riders. According to sources, the actor was grilled for 3 hours by the ED officials.

షారుఖ్ ను విచారించిన ఈడీ

Posted: 11/11/2015 02:45 PM IST
Shah rukh khan appears before ed

పుట్టిన రోజు సందర్భంగా దేశంలో అసహనం పెరిగిందంటూ వ్యాఖ్యలు చేసిన షారుక్ ఖాన్ విమర్శలు ఎదుర్కొన్నారు. బిజెపి నాయకులు, విహెచ్ పి నాయకులు షారుక్ మీద తీవ్రస్థాయిలో విమర్శలకు దిగారు. అయితే తాజాగా మరో తలనొప్పితో సారుఖ్ బాధపడుతున్నారు. గతంలో ఐపిఎల్ క్రికెట్ వివాదంలో తాజా ఈడీ విచారణు ఎదుర్కోవలసి వచ్చింది. విదేశీ మారక నిధులపై ఆరోపణలు ఎదుర్కొంటున్న షారూక్ పై ఇప్పటికే ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు కేసు నమోదు చేశారు. విచారణకు హాజరు కావాలని ఇప్పటికే రెండుసార్లు నోటీసులు కూడా జారీ చేశారు. అయితే తాను అందుబాటులో లేనని ఈడీ నోటీసులకు సమాధానమిచ్చిన షారూక్ నేటి ఉదయం నేరుగా ఈడీ కార్యాలయానికి వెళ్లక తప్పలేదు.

బాలీవుడ్‌ బాద్‌ షా షారుక్‌ ఖాన్‌ చుట్టూ ఈడీ ఉచ్చు బిగుస్తోంది. ఐపీఎల్‌ లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టు షేర్ల బదిలీకి సంబంధించి షారుఖ్‌ను ఈడీ ప్రశ్నించింది. షేర్ల విలువను తక్కువ చేసి చూపారన్న అంశానికి సంబంధించిన వివరాలు సేకరించింది. 2008లో నైట్‌రైడర్స్‌ షేర్లలో కొంత భాగాన్ని జుహీచావ్లా భర్త జైమెహతాకు సంబంధించిన ఓ సంస్థకు బదిలీ చేశారు. ఆ సమయంలో విలువను బాగా తక్కువగా చూపారన్న ఆరోపణలు వచ్చాయి. 2011 తర్వాత షారుఖ్‌ను ఈడీ ప్రశ్నించడం ఇది రెండోసారి. విదేశీ మారకద్రవ్య నిబంధనల ఉల్లంఘన కేసులో గతంలో ఓసారి ఈడీ షారుఖ్‌ను ప్రశ్నించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles