deepavali festival tips to escape from different types of problems while everyone burning crackers | diwali health tips

Deepavali festival tips to escape from different types of problems

deepavali health tips, diwali health tips, crackers using tips, diwali tips for everyone, how to celebrate diwali festive, diwali festival tips, diwali problems, diwali incidents

deepavali festival tips to escape from different types of problems : deepavali festival tips to escape from different types of problems while everyone burning crackers.

‘దీపావళి’లో ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

Posted: 11/10/2015 04:41 PM IST
Deepavali festival tips to escape from different types of problems

అంగరంగ వైభవంగా జరుపుకునే దీపావళి సందర్భంగా వాడే టపాసుల్లో ప్రమాదకరమైన రసానయనాలు వుంటాయి. ఆ టపాసుల్ని పేల్చినప్పుడు వెలువడే ఆ హానికారకమైన రసాయనాలు శరీరానికి, మెదడకు అనేక రకాలుగా నష్టాలు కలిగిస్తాయి. ఆరోగ్యపరంగా ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కోవలసి వస్తుంది. ముఖ్యంగా బాణసంచాలో వాడే అల్యూమినియం, ఆర్సెనిక్‌ సల్ఫైడ్‌లు కొంతమందిలో చర్మానికి చేటు చేస్తాయి. ఇవి తగిలినప్పుడు చర్మం ఎర్రగా కందిపోయే అవకాశం ఉంటుంది. ఈ రసాయనాలున్న టపాసులు కాల్చినప్పుడు కళ్లు ఎర్రబడడం, దురద పెట్టడం జరగవచ్చు. మరికొందరిలో గొంతు మంట, దురద రావచ్చు. శ్వాస తీసుకోవడంలోనూ తీవ్ర ఇబ్బంది ఏర్పడే ప్రమాదం వుంటుంది. టపాసుల శబ్దాలు, కాలుష్యం వల్ల కొందరికి తలనొప్పి, తల తిరగడం వంటి సమస్యలు రావచ్చు. ఇక అన్నింటికంటే పెద్ద ప్రమాదం వళ్లు కాలడం. పెద్దపెద్ద టపాసులు, బాణసంచాలు, బాంబులు కాల్చినప్పుడు ఇలా సంభవంచే అవకాశం వుంది. ఇలా రకరకాల సమస్యలు ఏర్పడినప్పుడు వాటికి అనుకూలంగా కొన్ని జాగ్రత్తలు పాటిస్తే.. ఈ దీపావళిని మరింత సంతోషంగా జరుపుకోవచ్చు.

* పొగ ఉన్న ప్రదేశానికి దూరంగా వెళ్లాలి. ఏదైనా గదిలోకి వెళ్లి తలుపులు, కిటికీలు మూసేసి, ఏసీ ఉంటే అది ఆన చేసి కూర్చోవాలి. ఆస్తమా ఉన్నవారిలో శ్వాస సమస్యలు తీవ్రంగా ఉండే అవకాశం ఉన్నందున వారు ఇనహేలర్‌, నెబ్యులైజర్‌ వంటివి అందుబాటులో ఉంచుకోవాలి. అవి వాడినా పరిస్థితి మెరుగు కాకపోతే వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి.

* ఊపిరితిత్తుల వ్యాధులు, ఎలర్జీలు ఉన్నవారు ఇంట్లో నుంచి బయటికి వెళ్లకపోవడం మంచిది. అది సాధ్యం కాకపోతే ఎన్95 మాస్క్‌ను తప్పనిసరిగా వాడాలి. ఇది గాలిలో ఉండే కాలుష్యాన్ని 95 శాతం వరకూ వడపోయగలుగుతుంది. ఇనహేలర్స్‌ను అందుబాటులో ఉంచుకోవాలి.

* కాలిన చోట చర్మం పగలకపోతే, కాలిన గాయం 4 నుంచి 5 సెంటీమీటర్లకు మించి లేకపోతే దానికి ఇంటివద్దే చికిత్స పొందవచ్చు. కాలిన గాయంపై 15-20 నిముషాలపాటు నీళ్లు ధారగా పడేటట్టు చేయాలి. దానిపై ఐస్‌ మాత్రం పెట్టవద్దు. కాలిన చోట యాంటీ బయాటిక్‌ ఆయింట్‌మెంట్‌ రాయాలి. దూదిని ఉపయోగించకూడదు. ముఖంపై గాయాలైన పక్షంలో డాక్టర్‌ వద్దకు తప్పనిసరిగా వెళ్లాలి.

* చర్మం ఎర్రగా కందిపోయినట్టు అనిపిస్తే వెంటనే నీటితో కడిగి కాలమైన లోషన రాయాలి. అయినా తగ్గకపోతే సెట్రిజిన వాడాలి. కళ్లు దురదపెడుతుంటే కళ్లను నలపవద్దు. మంచినీళ్లతో కళ్లను కడుక్కోవాలి. గొంతు మంట పుడితే లవంగాలు, మిరియాలు, తేనె వంటివి వాడడం మంచిది. టపాసులు కాల్చడానికి ముందు పొడుగు చేతులున్న కాటన్ చొక్కాలు ధరించాలి.

* టపాసులు కాల్చినప్పుడు వచ్చే భీకర శబ్దాల కారణంగా తలనొప్పి సమస్య ప్రతిఒక్కరికి ఏర్పడుతుంది. అప్పుడు వెంటనే పారాసెటమాల్‌ వేసుకోవాలి. మంచినీళ్లు, నిమ్మరసం, కొబ్బరి నీళ్ల వంటివి ఎక్కువగా తాగాలి. తల తిరగడంతోపాటు వాంతులు కూడా వస్తుంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : deepavali health tips  diwali incidents  

Other Articles