VHP worker dies in clashes over Tipu Jayanti celebrations

Vhp worker dies in clashes

Karnataka, Tippu sultan, Tipu Jayanti celebrations, Vishwa Hindu Parishad, Madikeri town, Mysore ruler Tipu Sultan

A Vishwa Hindu Parishad (VHP) activist died and several others, including policemen, were injured as violence broke out in Madikeri town of Karnataka on Tuesday over celebrations to mark the birth anniversary of 18th century Mysore ruler Tipu Sultan.

ITEMVIDEOS: కర్ణాటకలో ఉద్రిక్తత.. వి.హెచ్.పి కార్యకర్త మృతి

Posted: 11/10/2015 04:16 PM IST
Vhp worker dies in clashes

టిప్పు సుల్తాన్ జయంతి ఉత్సవాలు వేడుకలు ఉద్రిక్తతకు దారి తీశాయి. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం మొదటిసారిగా టిప్పు సుల్తాన్ జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తోంది అక్కడి కర్ణాటక ప్రభుత్వం. కాగా కొడగు జిల్లా కేంద్రం మడికెరిలో జయంతి ఉత్సవాల నిర్వహణను వ్యతిరేకిస్తూ విశ్వహిందూ పరిషత, భజరంగ్‌దళ్‌, హిందూజాగరణ వేదిక సంస్థలు ఆందోళన చేపట్టాయి. టిప్పు సుల్తాన్ జయంతి వేడుకలను జిల్లాలో బంద్‌కు పిలుపు ఇచ్చాయి. వారిని పోలీసులు అడ్డుకున్నారు. దాంతో రెచ్చిపోయిన ఆందోళకారులు పోలీసులపై రాళ్లు రువ్వారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు లాఠీచార్జీ జరిపారు. ఈ ఘటనలో వీహెచ్‌పీ కార్యకర్త ప్రాణాలు కోల్పోయాడు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

కర్ణాటక సర్కారు నిర్వహించ తలపెట్టిన మైసూరు పులి టిప్పు సుల్తాన్‌ జన్మదిన వేడుకలను బహిష్కరిస్తున్నట్టు బీజేపీ ప్రకటించింది. ఈ వేడుకలను పూర్తిగా బాయ్‌కాట్‌ చేస్తున్నామని.. తమ పార్టీ తరఫున ప్రతినిధులుగా ఎవ్వరూ హాజరు కాబోరని ఆ పార్టీ కర్ణాటక అధ్యక్షుడు ప్రహ్లాద్‌ జోషి స్పష్టం చేశారు. టిప్పుసుల్తాన్‌ను మత దురభిమాని, కన్నడ వ్యతిరేకిగా ఆయన పేర్కొన్నారు.  బీజేపీనే కాదు.. మంగళూరు యునైటెడ్‌ క్రిస్టియన్‌ అసోసియేషన్‌ సహా కర్ణాటకలోని పలు సంస్థలు, పలువురు వ్యక్తులు కూడా.. ప్రభుత్వం తలపెట్టిన ఈ వేడుకలను వ్యతిరేకించడం గమనార్హం. అయితే, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య మాత్రం టిప్పు జయంతి జరిపి తీరుతామని స్పష్టం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Karnataka  VHP  BJP  Mysore ruler Tipu Sultan  

Other Articles