siricilla anil second wife sana makes controversial comments on former mp rajaiah family in police investigation | sarika death case

Siricilla anil second wife sana makes controversial comments on rajaiah family in investigation

siricilla anil second wife sana, sarika death mystery, sarika death three children, sarika death incident, sarika children died, siricilla rajaiah family arrested, rajaiah family in police custody, sana with anil, siricilla anil with sana

siricilla anil second wife sana makes controversial comments on rajaiah family in investigation : siricilla anil second wife sana makes controversial comments on former mp rajaiah family in sarika and three children death case investigation.

రాజయ్య కోడలి సారిక కేసులో ‘సీక్రెట్’ మలుపు

Posted: 11/10/2015 11:01 AM IST
Siricilla anil second wife sana makes controversial comments on rajaiah family in investigation

రాష్ట్రవ్యప్తంగా సంచలనం సృష్టించిన మాజీ ఎంపీ రాజయ్య కోడలు సారిక, ఆమె ముగ్గురు పిల్లల మృతి కేసులో ఓ ‘సీక్రెట్’ కోణం వెలుగు చూసింది. ఈ కేసులో మాజీ ఎంపీ రాజయ్య, మాధవితోపాటు సారిక భర్త అనిల్, అతని రెండో భార్య సనను నాలుగో నిందితులుగా పేర్కొన్న పోలీసులు.. ఆమె నుంచి ఈ కేసుకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు. శనివారం రాత్రి ఖమ్మం జిల్లాలో ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. రెండు రోజులుగా కాకతీయ యూనివర్సిటీ పోలీస్‌స్టేషన్ పరిధిలోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(సీఆర్‌పీఎఫ్) క్యాంపులో సనను విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె కొన్ని ఆసక్తికరమైన విషయాల్ని వెల్లడించినట్లు తెలుస్తోంది. అనిల్‌తో జీవనం తన వల్ల కాదని, తనకు న్యాయం చేయాలంటూ కొన్ని నెలల క్రితమే రాజయ్య వద్దకు సన పంచాయతీ తెచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు ఇరు వర్గాల మధ్య రూ.10 లక్షలు చెల్లించాలని ఒప్పందం జరిగినట్లు విచారణలో సన తెలిపినట్లు సమాచారం. అయితే.. ఈ కేసు నుంచి తప్పించుకోవడం కోసమే సన ఈ కొత్త నాటకాన్ని తెరమీదకి తీసుకొచ్చిందని ఆరోపణలు వస్తున్నాయి.

ఇదిలావుండగా.. సారిక, ఆమె ముగ్గురు పిల్లల మరణాలపై ఇప్పటికీ అనుమానాలు వీడటం లేదు. సంఘటన జరిగిన రోజు రాత్రి వాస్తవంగా ఏం జరిగిందనే అంశం ఇంకా మిస్టరీగానే ఉంది. దుర్ఘటనకు ఆస్తి వివాదాలు ఏమైనా కారణమయ్యాయా అనేది తేలాల్సి ఉంది. వంటగ్యాస్ లీకై మంటలు చెలరేగిన తీరుపై స్పష్టత రాలేదు. అదేవిధంగా.. సంఘటనకు ముందు రోజు రాత్రి ఆహారంలో మత్తు పదార్థాలు ఏమైనా కలిపారా అనే అనుమాలు సైతం వ్యక్తమయ్యాయి. దర్యాప్తులో కీలకమైన ఫోరెన్సిక్ నివేదికలో ఏం తేలనుందనే అంశం చర్చనీయూంశంగా మారింది. సారిక, ముగ్గురు పిల్లల మరణం కేసులో నాలుగో నిందితురాలిగా ఉన్న సనను రెండు రోజులుగా రహస్యంగా విచారిస్తున్న పోలీసులు.. ప్రధాన నిందితుడు అనిల్, రాజయ్య, మాధవిల విచారణపై దృష్టి సారించాల్సి ఉంది. వీరిని కస్టడీలోకి తీసుకునేందుకు పోలీసులు ఇప్పటి వరకు కోర్టులో పిటిషన్ వేయలేదు. వీరిపై వరకట్న వేధింపులు(498-ఎ), ఆత్మహత్యకు ప్రోత్సహించడం(306) సెక్షన్ కింద కేసు నమోదైంది. మరోవైపు.. ఎన్నో ట్విస్టుల మధ్య కొనసాగుతున్న ఈ కేసులో మరెన్ని కొత్త కోణాలు వెలుగుచూస్తాయోనని అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles