Asaduddin owisi saying o my god

Asaduddin owisi saying o my god

MIM, Asaduddin Owaisi, Bihar, Elections,. Asaduddin Owaisi in Bihar, MIM in Bihar elections

MIM President, Asaduddin Owaisi told that he believes the theory of Kanshi Ram who told that “the elections for the first time are fought for losing, second time for defeating others and the third time for winning”.He was commenting on the defeat of MIM candidates in Bihar Assembly elections. MIM had floated six candidates in Seemanchal region of Bihar but all of them lost their deposits.

ఓ..మై గాడ్ అంటున్న ఓవైసీ

Posted: 11/09/2015 11:07 AM IST
Asaduddin owisi saying o my god

బీహార్ ఎన్నికలు అందరికి ఆశ్చర్యాన్ని కలిగించాయి. రకరకాల ఎగ్జిట్ పోల్స్ తో ఓటర్ల నాడిని పట్టుకోలేని చాలా టీవీ చానల్స్ ఫలితాల తర్వాత క్షమాపణలు చెప్పాయి. కాగా మోదీ పరాజయం గురించి అందరూ మాట్లాడుతుంటే.. మోదీ బద్ద వ్యతిరేకి ఓవైసీ మాత్రం ఓ కంట ఆనందాన్ని ఓ కంట దు:ఖాన్ని నింపుకున్నారు. నిజానికి నరేంద్ర మోదీకి బీహార్ ఓటర్లు ఇచ్చిన షాక్ మోదీ వ్యతిరేకులకు చాలా మంచి వార్తే కానీ ఓవైసీ మాత్రం దాన్ని పూర్తి స్థాయిలో ఆనందించలేకపోతున్నారు. బీహార్ లో మోదీకి పరాభవం తప్పదు.. ప్రజలు తప్పక మోదీకి బుద్ది చెబుతారు అన్న ఆయనే మనస్పూర్తిగా ఆనందించలేకపోతున్నారు. ఎందుకు అలా అంటే..

ప్రధాని నరేంద్ర మోదీ బీహార్ లో పార్టీ విజయానికి శాయశక్తుల ప్రయత్నించారు. బీహార్ లో అన్నీ తానై పార్టీ కోసం కష్టపడి పనిచేశారు. కానీ బీహారీలు మాత్రం నితీష్ కుమార్ కు, మహా కూటమికి పట్టంకట్టారు. అయితే ఏ పార్టీ ఎలా ఉన్నా కానీ ఎంఐఎం పార్టీ మాత్రం తమ పంథాలో కదిలింది. అయితే గతంలో కన్నా పార్టీకి ఎదురుదెబ్బ గట్టిగా తగిలింది. పార్టీ గతంలో 22 చోట్ల ఎన్నికల బరిలో నిలవగా.. రెండు సీట్లను కైవసం చేసుకుంది. కానీ ఈ దఫాలో మాత్రం ఆరు చోట్ల ఎంఐఎం పార్టీ అభ్యర్థులు బరిలో నిలువగా కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. అసదుద్దీన్ ఓవైసీ అన్నీ తానై ప్రచారం చేసినా కనీసం డిపాజిట్లు కూడా దక్కకపోవడం చాలా దారుణం. అయితే కేవలం 80 వేల ఓట్లను మాత్రమే సొంతం చేసుకున్న ఎంఐఎం మాత్రం తమ ప్రత్యర్థి బిజెపి పార్టీ ఓటమినైనా ఆస్వాదిస్తోంది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : MIM  Asaduddin Owaisi  Bihar  Elections  . Asaduddin Owaisi in Bihar  MIM in Bihar elections  

Other Articles