Telangana govt gave age relaxation in police notification

Telangana govt gave age relaxation in police notification

Telangana, JObs, Police Jobs, Police constables, KCR, telangana jobs, Latest Notification in Telangana, Telangana Jobs in Police dept

Telangana cm KCR singed on age relaxation file for Police notification. Telangana govt decided to fill more than nine thousand posts.

పోలీస్ ఉద్యోగార్థులకు కేసీఆర్ తీపి కబురు

Posted: 11/09/2015 08:23 AM IST
Telangana govt gave age relaxation in police notification

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న జాబ్ నోటిఫికేషన్ల మీద కేసీఆర్ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న తొమ్మిది వేలకుపైగా పోస్టులను భర్తీ చెయ్యాలని నిర్ణయించింది. కాగా వీటి నియామకాల్లో అభ్యర్థులకు మూడేళ్ళ వయోపరిమితి పెంచాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన ఫైలుపై తెలంగాణ ముఖ్యమంత్రి కేపీఆర్ సంతకం కూడా చేసేశారు. జనరల్‌ కానిస్టేబుళ్ల నియామకానికి 22 ఏళ్ల వయో పరిమితి ఉండేది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 27 ఏళ్ళ వయో పరిమితి ఉంది. ఇప్పుడు జనరల్‌ కేటగిరిలో 25 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 30 ఏళ్ళ వయసు వారు కూడా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించారు.

అలాగే జనరల్‌ కేటగిరిలో ఎస్‌ఐల కోసం 25 ఏళ్ళు, రిజర్వుడు కేటగిరి వారికి 30 ఏళ్ల వయోపరిమితి ఉండేది. వీరందరికి ఇప్పుడు మూడేళ్ళ వయో పరిమితి సడలించారు. పోలీస్‌ శాఖలో కమ్యూనికేషన్ల విభాగాన్ని పటిష్టం చేయాలని కూడా కేసీఆర్‌ ఆదేశించారు. రాష్ట్ర విభజన జరిగిన సందర్భంలో తెలంగాణ రాష్ట్రానికి 335 కానిస్టేబుల్‌ పోస్టులు కమ్యూనికేషన్‌ విభాగంలో కేటాయించారు. అయితే ఇందులో కేవలం ముగ్గురు మాత్రమే కానిస్టేబుళ్లు న్నారు. 332 పోస్టులు ఖాళీగా ఉన్న 332 పోస్టులను ఒకేసారి భర్తీ చేయాలని కూడా సీఎం ఆదేశించారు. పోలీస్‌ శాఖలోని కమ్యూనికేషన్‌ విభాగంలో నియామకాలు చేపట్టక 12 ఏళ్ళు కావడంతో ఈ ఖాళీలు ఏర్పడ్డాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles