Romanian Prime Minister Victor Ponta has said he is resigning over Bucharest nightclub fire | nightclub fire incident controversy

Romania pm victor ponta resigns his post over bucharest nightclub fire

victor ponta, nightclub fire incident, romania nightclub incident, romania controversy, romania nightclub fire incident, victor ponta resigns pm post, social democratic leader liu dragnia

Romania PM Victor Ponta resigns his post over Bucharest nightclub fire : Romanian Prime Minister Victor Ponta has said he is resigning, a day after some 20,000 people took to the streets to protest against a nightclub fire that left 32 people dead.

ఫైర్: ప్రమాదంలో ‘ప్రధాని’ పదవి!

Posted: 11/04/2015 04:02 PM IST
Romania pm victor ponta resigns his post over bucharest nightclub fire

ఓ నైట్‌క్లబ్‌లో అనుకోకుండా జరిగిన భారీ అగ్ని ప్రమాదం ఏకంగా ‘ప్రధాని’ పదవికే ఎసరు పెట్టింది. ఆ దుర్ఘటన జరిగిన నేపథ్యంలో వెల్లువెత్తిన నిరసనన, ఆందోళనలను సదరు దేశ ప్రధానిని తీవ్రంగా కలచివేయడంతో ఆయన తన పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. ఓ అగ్నిప్రమాదం కారణంగా ఏకంగా దేశ ప్రధాని తన పదవికి రాజీనామా చేయడంతో ఈ విషయం ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది.

ఇటీవల రొమేనియాలోని బుకారెస్ట్‌లో గల ఓ నైట్‌క్లబ్‌లో పేలుడు, అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 33 మంది మరణించగా.. దాదాపు 180 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. టపాసులతో కూడిన రాక్ సంగీత కచేరీ నిర్వహించిన సందర్భంగా ఈ ప్రమాదం జరిగినట్లు రొమేనియా ప్రభుత్వాధికారులు తెలిపారు. కానీ, క్లబ్ లోపల టపాసులు కాల్చేందుకు ప్రయత్నించడం వల్లే ఈ దారుణం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఏదేమైనా.. ఈ ఘటనకు బాధ్యత వహించి వెంటనే ప్రధాని రాజీనామా చేయాలని, ప్రభుత్వం అవినీతిమయంగా మారిందని భారీ ఎత్తున ఆందోళనకారులు బుకారెస్ట్ వీధుల్లోకి వచ్చి ఆందోళన నిర్వహింటారు. విశేషం ఏమిటంటే.. ఈ ఆందోళనలో దాదాపు 20 వేలమంది పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోనే కొన్ని హింసాత్మకమైన ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి.

ఈ విధంగా భారీగా ఆందోళన వెల్లువెత్తడంతో ఆశ్చర్యానికి గురైన ఆ దేశ ప్రధాని విక్టోర్ పాంటా.. తన పదవికి రాజీనామా చేసే ఆలోచన చేస్తున్నట్లు సోషల్ డెమొక్రటిక్ నేత లియు డ్రాగ్నియా తెలిపారు. 'నా బాధ్యతలు ఎవరికైనా అప్పగించాలనుకుంటున్నాను. నేను రాజీనామా చేస్తున్నాను' అని పాంటా చెప్పినట్లు డ్రాగ్నియా చెప్పారు. ఆ ఘటనకు బాధ్యత వహించి పార్టీ నేతలతో చర్చించిన తర్వాత ప్రధాని పదవికి పాంటా రాజీనామా చేస్తారని తెలుస్తోంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pm victor ponta  romania nightclub fire incident  romania protest  

Other Articles