Volkswagen hit with Australian lawsuit over emissions scandal | Volkswagen Controversy | Audi Cars Emission Scandal

Volkswagen hit with australian lawsuit over emissions scandal audi cars controversy

Volkswagen controversy, Volkswagen law suit, Volkswagen hit with law suit, Volkswagen australian law suit, Volkswagen audio cars, australia federal court, Volkswagen banister law, Volkswagen customers

Volkswagen hit with Australian lawsuit over emissions scandal : Troubled German carmaker Volkswagen has been hit with its first Australian class action lawsuit for selling vehicles that contained emissions defeating devices.

‘వోగ్స్ వ్యాగెన్’కు తగిలిన మరో ఎదురుదెబ్బ!

Posted: 11/02/2015 11:11 AM IST
Volkswagen hit with australian lawsuit over emissions scandal audi cars controversy

‘వోగ్స్ వ్యాగెన్’.. ఒకప్పుడు ప్రపంచాన్ని శాసించిన దిగ్గజ కంపెనీ! జర్మనీకి చెందిన ఈ కంపెనీ ‘నాణ్యత’ పేరిట కొన్ని కోట్ల కార్లను విక్రయించి, అత్యధిక లాభాన్ని ఆర్జించి, తనకు మరో కంపెనీ సాటి లేదంటూ నిరూపించింది. కానీ.. ఇప్పుడు తీవ్ర ఇబ్బందుల్లో కూరుకుపోయింది. కారణం.. ‘నాణ్యత’ అనే పేరును అడ్డం పెట్టుకుని ఆ కంపెనీ మొదటిస్థానంలో నిలబడిందో అందులోనే లోపం వుందని బట్టబయలు కావడం. అవును.. ఈ కంపెనీ తయారు చేసిన కారు ఇంజను అసలు నాణ్యత లేనిదన్నది నిరూపితమైంది. దీంతో ఈ కంపెనీకి ఒకేసారి చిక్కుముడులు వచ్చిపడుతున్నాయి. అసలే చిక్కుల్లో ఉన్న ఈ ఫోక్స్ వ్యాగన్ కంపెనీకి తాజాగా మరో ఎదురు దెబ్బ తగిలింది.

ఇప్పటికే సమస్యాత్మక ఈఏ టైప్ ఇంజన్లు ఉన్న కార్లను వెనక్కి తెప్పించుకుంటున్న ఈ ఆటో మొబైల్ దిగ్గజానికి వ్యతిరేకంగా తొలిసారి కోర్టులో దావా నమోదైంది. నాణ్యతలేని పరికరాలతో కంపెనీ తమను మోసం చేసిందంటూ సోమవారం ఆస్ట్రేలియా ఫెడరల్ కోర్టులో బ్యానిస్టర్ లా దాఖలైంది. కాలుష్య నియంత్రణ విషయంలో వినియోగదారులను వోక్స్ వ్యాగన్ కంపెనీ మోసం చేసిందని.. నాసిరకం పరికరాలు ఉన్న కార్లను అమ్మి కస్టమర్లను మోసం చేసిందని.. ఈ కార్ల కంపెనీపై రెండు వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఈ కేసులో ఫోక్స్ వ్యాగెన్ కి వ్యతిరేకంగా కేసు నిరూపితమైతే.. కస్టమర్లకు బిలియన్ డాలర్లు నష్ట పరిహారం కట్టాల్సి వస్తుంది. నిజానికి ఈ కంపెనీ తాము తయారుచేసిన కార్లు మిగిలిన కార్ల కన్నా తక్కువ కాలుష్యం విడుదల చేస్తాయని బాగా ప్రచారం చేసుకుంది. కానీ.. అందుకు ఓ సాఫ్ట్ వేర్ వాడుకున్న విషయాన్ని మాత్రం గోప్యంగా దాచింది. ఇన్నాళ్లూ ఎలాగోలా తమ రహస్యాన్ని దాచిపెట్టింది కానీ.. చివరికి అది తెలిసిపోవడంతో ఈ కంపెనీ నిజస్వరూపం బయటపడింది. ఈ విషయం తెలుసుకున్న కస్టమర్లు.. ఆ కార్లు విడుదల చేసే కాలుష్యం ఎక్కువ ఉన్నా, తక్కువగా చూపించే సాఫ్ట్ వేర్ వాడారన్నది కంపెనీపై అభియోగం మోపుతున్నారు.

మరో వైపు ఆస్ట్రేలియన్ ప్రభుత్వం, అధికారులు కూడా ఈ కార్ల తయారీ దిగ్గజంపై గుర్రుగానే ఉన్నారు. ఆస్ట్రేలియాలోని కాలుష్య నియంత్రణ చట్టాలను మోసం చేసినందుకుగానూ భారీగా జరిమానా విధించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే కంపెనీ ఉన్నతాధికారులతో ఆస్ట్రేలియా ప్రభుత్వ వర్గాలు చర్చలు జరిపాయి. ఈ ఏడాది అక్టోబర్ లో ఫోక్స్ వాగన్ ప్రపంచ వ్యాప్తంగా 1.1 కోట్ల డీజిల్ కార్లకు ఒకే రకమైన సాఫ్ట్ వేర్ వాడి కస్టమర్లను మోసం చేసినట్లు అంగీకరించిన విషయం విదితమే. ఈ సాఫ్ట్ వేర్ ఉపయోగించి తయారు చేసిన 91,000 వేల ఫోక్స్ వాగన్, ఆడీ కార్లను వెనక్కి తెప్పించుంకుంది. వచ్చే ఏడాది జనవరి నాటికి ప్రపంచ వ్యాప్తంగా ఈ సమస్య ఉన్న కార్లన్నింటినీ రీకాల్ చేయాలని నిర్ణయించుకుంది. టైప్ ఈఏ 189 ఇంజన్లు ఉన్న కార్ల విక్రయాలను నిలిపేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles