Inside the Church Made of 40thousand Human Skeletons

Inside the church made of 40thousand human skeletons

parague , czech republic , skelton , church , ossuaries, Czech Republic, bone church, skeletons, bones, video, ossuary, Sedlec Ossuary, plague, catacombs, history is ghastly

What do you do if you’re a monk and you’re surrounded by the skeletal remains of thousands of people as part of your day job? If your answer is to make furniture out of the remains of the dead, reflect on human mortality, maybe paint a vanitas if you’re looking to give in 110 percent, you’re totally fit to work in an ossuary.

ఆ చర్చ్ లో 40వేల అస్థిపంజరాలు

Posted: 10/30/2015 04:49 PM IST
Inside the church made of 40thousand human skeletons

చాలా మందికి పుర్రెలు, ఎముకలు కనిపిస్తే చాలా భయమేస్తుంది. కానీ వాటినే చూసేందుకు ఓ చర్చికి చాలా మంది పర్యాటకులు వెళుతున్నారు. అవును.. చర్చ్ కే వెళుతున్నారు. చర్చ్ లో ఉన్న పుర్రెలు, ఎముకలే అక్కడ అద్భుతాలు కాబట్టి. దాదాపు 40 వేల అస్థిపంజరాలతో ఆ చర్చిని డిజైన్ చేశారు. చెక్ రిపబ్లిక్ రాజధాని పరాగ్వేకు సమీపంలో ఉన్న సెడ్లాక్ ఊళ్లో ఆ చర్చి ఉంది. దీన్ని ముద్దుగా బోన్ చర్చి అని పిలుస్తారు. ఇక్కడికి రోజుకు వేల మంది వస్తుంటారు. ఎంతో మంది పర్యాటకులను ఈ చర్చ ఆకర్షిస్తోంది.


1278వ సంవత్సరంలో సెడ్లాక్‌కు చెందిన ఓ వ్యక్తి జెరుసలాం వెళ్లాడు. అతను అక్కడి మట్టిని తెచ్చి ఆ ఊళ్లో చల్లాడు. ఆ పవిత్ర స్థలం శ్మశాన వాటికగా మారింది. దీంతో స్థానికులు అక్కడే శవాలను పాతిపెట్టడం మొదలుపెట్టారు. ఆ సాంప్రదాయం 14వ శతాబ్ధం వరకు కొనసాగింది. అప్పుడే యూరోప్ అంతా ప్లేగ్ ప్రబలింది. ఆ వ్యాధి వల్ల 30వేల మంది బలయ్యారు. వాళ్లను ఇక్కడే పూడ్చారు. ఆ తర్వాత మతయుద్ధాల వల్ల సెడ్లాక్ ప్రాంతంలో మరో 10వేల మంది చనిపోయారు. వాళ్లను కూడా అక్కడే పాతిపెట్టారు. 15వ శతాబ్ధంలో చర్చి నిర్మాణం కోసం శవాలు పాతిపెట్టిన ప్రాంతాన్ని తొవ్వారు. 1870 వరకు ఆ అస్థిపంజరాలను ఎవరూ ముట్టుకోలేదు. ఆ తర్వాత స్థానిక శిల్పితో ఓ అద్భుత కళాఖండాన్ని నిర్మించారు. ఆ చిన్న చర్చిలో ఎముకలు ఎన్నో రూపాల్లో పర్యాటకులను ఆకట్టుకుంటాయి. పుర్రెల దండలు చర్చి విజిటర్స్‌ను ఆహ్వానిస్తాయి. ఇక వెన్నుపూసలతో చేసిన శాండిలీర్ ఆ చర్చికే అట్రాక్షన్ పాయింట్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles