కన్నడ చిత్రపరిశ్రమలో ఒకప్పుడు హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన నటి రమ్య.. గతకొన్నాళ్ల నుంచి పొలిటికల్ రంగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. 15వ లోక్‌సభకు మాంధ్య నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన రమ్య.. గత లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆమెకు రాష్ట్ర అసెంబ్లీ ఉభయ సభల్లో దేనీలోనూ సభ్యత్వం లేదు. అయినప్పటికీ ఏమాత్రం నిరాశ చెందని ఆమె రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానం దక్కించుకోవడం కోసం నిరంతర ప్రయత్నాలు చేస్తూ వస్తోంది. బహుశా ఆ ప్రయత్నాల్లో భాగంగానే ఈమెకు ఇప్పుడు ఓ వరం లభించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అధిష్టానం ఈమెకు అత్యంత కీలకమైన పదవి అప్పజెప్పేందుకు నిర్ణయం తీసుకోనుందని సమాచారం.
కర్నాటక ఆరోగ్య శాఖ మంత్రిగా కన్నడ నటి రమ్యను తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి కె. సిద్ధరామయ్యకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి ఆదేశాలు అందినట్టుగా తెలిసింది. రాష్ట్ర పార్టీలో పెరిగిపోతున్న కుమ్ములాటలను పరిష్కరించేందుకు రాష్ట్ర కేబినెట్‌ను పునర్వవ్యస్థీకరించాలని సిద్ధరామయ్య గత కొంతకాలంగా భావిస్తున్నారు. ఈ దిశగా కసరత్తు చేయడంలో భాగంగానే ఆయన ఇప్పుడు ఢిల్లీలో మకాం వేశారు. ఇప్పటికే ఆరోగ్యశాఖ మంత్రిగా పార్టీలో పలు విమర్శలు ఎదుర్కొంటున్న మాజీ ప్రముఖ సినీ నటుడు అంబరీష్‌ను తొలగించి, ఆ స్థానంలో రమ్యను తీసుకోవాలని సిద్ధరామయ్యకు పార్టీ సీనియర్ నాయకుడు ఎస్‌ఎం కృష్ణ ప్రతిపాదించినట్టు తెల్సింది. దాదాపు రెండు దశాబ్దాలుగా రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న అంబరీష్ ఆరోగ్యం హఠాత్తుగా దెబ్బతినడంతో గత ఏడాది ఆయన్ను సింగపూర్‌కు తరలించి వైద్య సేవలు అందించారు. అందుకైన కోటిన్నర రూపాయల ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరించింది. అప్పటి నుంచి ఆయనను పదవి నుంచి తప్పించాల్సిందిగా పార్టీలో అంతర్గతంగా ఒత్తిడి పెరిగింది.
ఇక ఇటీవలి కాలంలో అంబరీష్‌ను కూడా సిద్ధరామయ్య బహిరంగంగానే విమర్శిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన్ను ఆరోగ్యశాఖ మంత్రి పదవి నుంచి తొలగించనున్నట్లు అంతర్గతంగా ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే.. ఆయన స్థానంలో పేరుగాంచిన సెలబ్రిటీని తీసుకుంటే తమ పార్టీకి మరింత గుర్తింపు దక్కతుందన్న భావనతో రమ్య పేరును పరిశీలిస్తున్నట్లు తెలిసింది. మంత్రివర్గంలోకి తీసుకున్నాక, ఆమెకు ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని కట్టబెడతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more