People are dying but KCR doing Chandiyagam

People are dying but kcr doing chandiyagam

KCR, Chandiyagam, Modi, President, Kanche Ailayya

Telangana cm KCR doing chandiyagam in this December. He invited pm Modi on Chandiyagam. Today he will meet president and invites him to Yagam.

జనం చస్తుంటే కేసీఆర్ చండీయాగం చేస్తారా..?

Posted: 10/28/2015 08:52 AM IST
People are dying but kcr doing chandiyagam

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ డిసెంబర్ లో చండీయాగం చేయనున్నారు. కాగా ఈ యాగానికి ప్రధాని మోదీ, రాష్ట్రపతి, గవర్నర్లను, పలువురు ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు. కేసీఆర్ చేయనున్న చండీయాగం మీద అప్పుడే విమర్శలు వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో జనం బాధతో ఛస్తుంటే ఆయన మాత్రం చండీయాగం చెయ్యడానికి సిద్దమవుతున్నారని.. చాలా సిగ్గు చేటని.. ప్రొఫెసర్ కంచె ఐలయ్య విమర్శించారు.  మతానికి సంబంధ పండగలు ప్రభుత్వాలు చేయడం ఎక్కడా చూడలేని, కేసీఆర్‌ మళ్లీ భూస్వామ్య వ్యవస్థను తీసుకొస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలోని ఒక్క యూనివర్సిటిలో కూడా వైస్‌ చాన్సలర్‌ను నియమించకుండా విద్యను నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు.

అలాగే కేసీఆర్ ప్రభుత్వం మీద కూడా కంచె ఐలయ్య విమర్శలు గుప్పించారు. 2014 జూన్‌ 2 నుంచి తెలంగాణలో అసలు ప్రభుత్వమే పని చేయడం లేదని ఎద్దేవా చేశారు. వందలాది రైతులు ఆత్మహత్య చేసుకుంటుంటే పట్టించుకోకపోవడం దారుణమని, కేసీఆర్‌కు తలకాయ పని చేయని క్యాన్సర్‌ సోకిందని మండిపడ్డారు. రాష్ట్రంలో కుటుంబ తెలంగాణ కుదరదన్నారు. పూర్తిస్థాయిలో రైతు రుణమాఫీ చేయలేని ముఖ్యమంత్రి పుష్కరాలు, బతుకమ్మలు, బోనాలు చేస్తూ దొరల పాలనను సాగిస్తున్నారని విమర్శించారు. నిన్న నీతి ఆయోగ్ సమావేశానికి హాజరైన కేసీఆర్ మోదీని తన చండీయాగానికి ఆహ్వానించారు. దానికి మోదీ కూడా ఒప్పుకున్నారని.. మోదీ తప్పకుండా వస్తారని కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : KCR  Chandiyagam  Modi  President  Kanche Ailayya  

Other Articles