boyfriend escaped from marriage | boyfriend cheated girlfriend | bride escaped from marriage

Boyfriend escaped from marriage in tirupati

boyfriend escaped marriage, vivek escaped from marriage, bride escape from marriage, marriage cheating cases, boyfriend fraud girl friend

boyfriend escaped from marriage event in tirputi : A boyfriend named vivek escaped from marriage.

కాసేపట్లో పెళ్లి పెట్టుకుని పరారైన ప్రియుడు

Posted: 10/27/2015 12:07 PM IST
Boyfriend escaped from marriage in tirupati

‘ప్రేమ’ అనే పదం వినడానికి ఎంత మధురంగా వుంటుందో.. దాన్ని అనుభవించిన తర్వాత అందులో వుండే ‘చేదు’ ఏంటో కూడా తెలుస్తుంది. కానీ..నేటి యువతకు ఈ రెండింటిలో కేవలం మొదటిది మాత్రమే అర్థమవుతుంది. ఆతృత ఎక్కువ కదా.. ‘ప్రేమ’ అనే పదం వినగానే అందులో మునిగిపోయి ఏవేవో కలలు కంటుంటారు. అంతేకాదు.. పెళ్లికిముందే చేయరాని పనులు సైతం చేసేస్తుంటారు. ఆ తర్వాత తాము చేసిన తప్పుకు పశ్చాత్తాపపడుతుంటారు. ఇలాగే ఒకబ్బాయి ప్రేమలో పడి కలలరాజ్యంలో తేలిన ఓ అమ్మాయి.. చివరికి తాను మోసపోయానని తెలిసి బాధపడుతోంది.

ఇద్దరూ ప్రేమించుకున్నారు. జీవితాంతం కలసి ఉండాలని రిజిష్టర్ వివాహం చేసుకున్నారు. ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించి ప్రేమజంటకు సంప్రదాయబద్ధంగా పెళ్లి చేయాలని నిర్ణయించారు. అయితే చివరి నిమిషంలో ప్రియుడు పరారీ కావడంతో పెళ్లి ఆగిపోయింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వరదయ్యపాలెం మండలం రాసికండ్రిగకు చెందిన వివేక్, తమిళనాడుకు చెందిన సంగీత ప్రేమించుకున్నారు. గత ఆగస్టు 18న గుమ్మడిపూడిలో వీరిద్దరూ రిజిష్టర్ వివాహం చేసుకున్నారు. ఇద్దరి కుటుంబ సభ్యులు జోక్యం చేసుకుని సంప్రదాయబద్ధంగా పెళ్లి చేయాలని నిర్ణయించారు. వివాహానికి ఏర్పాట్లు కూడా చేశారు. కాసేపట్లో పెళ్లి పెట్టుకుని ప్రియుడు ఉడాయించడంతో వివాహం ఆగిపోయింది.

బాధితురాలి బంధువులు తిరువల్లూరు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం అతడికోసం గాలిస్తున్నారు. అందుకే పెద్దలు అంటారు.. ప్రేమించడం మంచిదే కానీ దాన్ని బాధ్యతగా గుర్తించే వారిని ప్రేమిస్తే ఇంకా శ్రేయస్కరమని. కానీ.. ఇటువంటి సూక్తులు ఎవరికి నచ్చుతాయి చెప్పండి..?

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : boyfriend escaped marriage  

Other Articles