Vivek wont jump into TRS party

Vivek wont jump into trs party

Vivek, MP Vivek, TRS, Warangal, Elections, KCR, Congress

Former MP Vivek clear that he is not joining into TRS Party. TRS President plans to give mp ticket to Vivek from TRS party.

గులాబీదళంలోకి వివేక్.. అవన్నీ పుకార్లే

Posted: 10/26/2015 09:43 AM IST
Vivek wont jump into trs party

కాంగ్రెస్‌ మాజీ ఎంపి వివేక్‌ టిఆర్‌ఎస్‌లో చేరుతారన్న పుకార్లు షికార్లు చేస్తున్నాయి. శనివారం హైదరాబాద్‌లో టిఆర్‌ఎస్‌ ఎంపి కె కేశవరావు, మంత్రి హరీష్‌రావుతో ఆయన భేటీ అయ్యారని కథనాలొస్తున్నాయి. వరంగల్‌ ఉపఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ అభ్యర్థిగా వివేక్‌ను రంగంలో దించాలని, అందుకు ఆయనే సమర్ధవంతమైన నేతగా టిఆర్‌ఎస్‌ భావిస్తున్నట్టు ఆ పార్టీ వర్గాలు లీకులిస్తున్నాయి. ఉప ఎన్నికలకు ముందు ఇలాంటి పరిణామాలతో కాంగ్రెస్‌ పార్టీని దెబ్బతీయాలని అధికార పార్టీ వ్యూహరచన చేస్తోంది. కాంగ్రెస్‌వర్గాలు మాత్రం కొట్టిపారేస్తున్నాయి. గత సాధారణ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్‌ టికెట్‌పై పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఇటీవల జరిగిన కొన్ని పరిణామాల నేపథ్యంలో ఆయన గులాబీ గూటికి చేరుతారన్న పుకార్లు వినిపిస్తున్నాయి.

వివేక్‌ తండ్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ కేంద్ర మంత్రి గడ్డం వెంకటస్వామి విగ్రహాం ట్యాంక్‌ బండ్‌పై ఏర్పాటు చేసే క్రమంలో వివేక్‌తో సిఎం సంప్రదింపులు జరిపింది.కేసీఆర్ తో ఉన్న చనువు. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత పరిస్థితి నేపథ్యంలో వివేక్ ఖచ్చితంగా కారులో షికారు చేస్తారని అంతా ఊహిస్తున్నారు. కానీ వివేక్ మాత్రం పార్టీ మారే ఆలోచన లేదని వెల్లడించారు. వరంగల్ ఉపఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో గులాబీ పార్టీ తరఫున బలమైన అభ్యర్థి కోసం టిఆర్ఎస్ పార్టీ వెతుకుతోంది. అందులో భాగంగానే వివేక్ ను తమ పార్టీలోకి చేర్చుకొని... పార్టీ తరఫున ఎన్నికల బరితో నిలబెట్టాలని కేసీఆర్ ఆలోచిస్తున్నారు. కానీ అదంతా జరిగేటట్లు కనిపించడం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vivek  MP Vivek  TRS  Warangal  Elections  KCR  Congress  

Other Articles