Baby doing the bubble butt dance in the bath

Babys bubble butt dance in the bath

bubble butt dance, Baby Dance, Baby dance in bathtub

A video of a mother who used an electric hand-held mixer to froth her baby's bubble bath has sparked a fiery debate on YouTube. The video shows the mother using the Braun electric appliance to create a bubble bath for her baby who is dancing in the tub.

ITEMVIDEOS: బాత్ రూంలో.. బుడ్డోడు భలే డ్యాన్స్ చేస్తాడు

Posted: 10/24/2015 05:14 PM IST
Babys bubble butt dance in the bath

చిట్టిపొట్టి పాపాయిలను చూస్తేనే ముద్దొస్తారు. అదే డాన్స్ చేస్తే అలా నోరెళ్లబెట్టి చూడాల్సిందే! అలా చూసి వదిలేయకుండా ఓ తల్లిదండ్రులు వీడియో తీసి ఆన్‌లైన్‌లో పోస్ట్ చేశారు. తల్లిదండ్రులు పాట పాడుతుండగా ఒంటి నిండా నురగతో.. బాత్‌టబ్‌లో బబుల్ బట్ డాన్స్‌ని అనుకరిస్తూ ఆ పిల్లాడు మ్యాక్స్ నృత్యాన్ని చేశాడు. ఒకవైపు తల్లి ఎలక్ట్రిక్ హ్యాండ్ - హెల్డ్ మిక్సర్‌తో నురగని తెప్పిస్తూ ఆ బుజ్జాడిని బుడగలతో నింపేసింది. ఆ బుడగల నడుమ ఆ బుజ్జిగాడు అలుపెరగకుండా డాన్స్ చేస్తూ నెటిజన్లను అలరిస్తున్నాడు. అయితే ఈ పాపులర్ అయిన వీడియో మీద కొన్ని నిరసనలు వెలువెత్తుతున్నాయి. అదేంటి నిరసనలు ఏంటా అనుకుంటున్నారా..? అయితే మొత్తం స్టోరీ చదవండి.

బుడతడి కోసం వాళ్ల అమ్మ ఎలక్ట్రికల్ పనికరంతో అలా బుడగలు సృష్టించేటప్పుడు.. ఆ పిల్లాడికే ఏమైనా జరిగితే ఏం చేస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. కొందరేమో చిన్నారుల చేష్టలను వీడియో తీసి ఆన్‌లైన్‌లో పెట్టడానికి తల్లిదండ్రులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నట్లు కామెంట్ చేస్తున్నారు. అయితే ఈ వీడియోకి సంబంధించి కొందరమో ఆ ఎలక్ట్రిక్ పరికరం ఏం చేయదంటూ, తల్లిదండ్రులకు పిల్లల మీద శ్రద్ధ ఉంటుందంటూ ఆ తల్లిదండ్రులను సపోర్ట్ చేస్తున్నారు. వీరి వాదనలు ఎలా ఉన్నా ఈ బుడ్డోడి వీడియో మాత్రం నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bubble butt dance  Baby Dance  Baby dance in bathtub  

Other Articles