Ap govt hike RTC bus charges from last night

Ap govt hike rtc bus charges from last night

APSRTC, Chandrababu Naidu, AP, RTC, Bus Charges, RTC Buses, Buses, Bus charge, Bus Fair

Ap govt hike RTC bus charges from last night. APSRTC hike the fair from five percent to ten percent. ap govt passed new GO on rtc bus charges yesterday evening.

బస్సు ఎక్కితే జేబు ఖాళీ.. ఛార్జీలు పెంచిన ఏపి సర్కార్

Posted: 10/24/2015 08:51 AM IST
Ap govt hike rtc bus charges from last night

మొత్తానికి ఏపి ప్రభుత్వం ఆర్టీసీ ఛార్జీలను పెంచింది. ఇప్పుడు పెరుగుతాయి.. ఇప్పుడు అంటూ వార్తలు ఎన్నో సార్లు వచ్చినా నిన్న ఆర్టీసీ ఛార్జీలను పెంచుతూ ఏపి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జీవో కూడా చకచకా జారీ అయింది. తాజాగా ఏపీలో ఆర్టీసీ బస్సు ఛార్జీలు భారీగా పెరిగాయి. ఐదు నుంచి పది శాతం మేర ఛార్జీలు పెంచింది ఆర్టీసీ. పెరిగిన బస్సు ఛార్జీలు శుక్రవారం అర్ధరాత్రి నుంచే అమల్లోకి వచ్చేశాయి. ఆర్టీసీ బస్సు చార్జీలను తక్షణమే పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పల్లెవెలుగు బస్సు చార్జీలు 5 శాతం మేరకు పెరగగా, ఎక్స్ ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సుల్లో చార్జీలను 10 శాతం మేరకు పెంచారు.

పల్లె వెలుగు బస్సులకు కిలోమీటరుకు 3 పైసలు, ఎక్స్‌ ప్రెస్, డీలక్స్ సర్వీసులలో అయితే కిలోమీటరుకు 8 పైసల వంతున పెంచారు. అదే సూపర్ లగ్జరీ, గరుడ, వెన్నెల సర్వీసులలో అయితే కిలోమీటరుకు 9 పైసల వంతున చార్జీలను పెంచారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రస్తుతం హైదరాబాద్ – విజయవాడ మధ్య ఎక్స్ ప్రెస్ బస్సుల్లో 213 రూపాయలు చార్జి చేస్తుండగా ఇకనుంచీ రూ. 235 వసూలు చేస్తారు. డీలక్స్ బస్సు టికెట్ 240 నుంచి 264 రూపాయలకు పెరిగింది. సూపర్ లగ్జరీ బస్సు చార్జీలు 283 రూపాయలు ఉండగా ఇక 303 రూపాయలు చెల్లించుకోక తప్పదు. ఇక ఏసీ, ఇంద్ర, గరుడ, రాజహంస బస్సుల్లోనూ ఎక్కువ చెల్లించాల్సిందే. కాగా ఏపీఎస్ ఆర్టీసీ చైర్మెన్ మాత్రం పేద వారికి ఆర్టీసీ చార్జీలు భారం కావు అంటూ స్టేట్ మెంట్ ఇవ్వడం కొసమెరుపు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : APSRTC  Chandrababu Naidu  AP  RTC  Bus Charges  RTC Buses  Buses  Bus charge  Bus Fair  

Other Articles