clothes given by ap government are of Inferior quality alleges amaravati farmers

Invitation cards not yet reached to farmers in amravati region

clothes given by ap government, invitation cards not yet reached to farmers, amaravati farmers not yet invited, no border for dhotis, no border for sarees, ap government clothes are of Inferior quality, amaravati region farmers, amaravati, farmers, invitation, clothes, Inferior quality

invitation cards not yet reached to farmers, who contributed their lands to amravati, and some allege that the clothes given by ap government are of Inferior quality and not siutable to wear

అమరావతి రైతులకు పరాభవం.. అందని అహ్వానం.. చీర, పంచెలు నాసిరకం..

Posted: 10/21/2015 01:33 PM IST
Invitation cards not yet reached to farmers in amravati region

రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల్లో భూములిచ్చిన 23 వేల మంది రైతులను శంకుస్థాపనకు ఆహ్వానించి పెద్దపీట వేసి గౌరవిస్తామని ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించినా అది అములుకు మాత్రం నోచుకోవడం లేదు. ప్రతి గ్రామంలో రైతుల ఇళ్లుకు వెళ్లి ఆహ్వాన పత్రికతోపాటు యజమాని, యజమానురాలికి పంచె, ధోవతి, చీర ఇచ్చి బొట్టుపెట్టి ఆహ్వానం పలకాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ బాధ్యతలను పలువురు ఎంపిక చేసిన మహిళలకు అప్పగించింది. కానీ ఇప్పటికీ అనేక గ్రామా రైతులకు ఆహ్వానాలు అందకపోవడంతో.. ఎదురు చూడటం వారి వంతైంది.

శనివారం సాయంత్రం తొలిసారి నేలపాడు నుంచి అట్టహాసంగా చీర, పంచె, ధోవతితోపాటు స్వీట్ బాక్స్ ఇచ్చి పంపిణీ ప్రారంభించింది. ఈ హడావుడి కేవలం నేలపాడు, తుళ్ళూరు గ్రామాలకు మాత్రమే పరిమితమైంది. పండుగ వేళ మిఠాయిలతో రైతులను పలుకరించాలన్న ప్రభుత్వ సంకల్పానికి  టీడీపీ నేతలు గండి కోడుతున్నారు. స్వీట్లను అమాంతం మెక్కేసిన నేతలు కేవలం చీర, పంచెలను మాత్రమే పంపిణీ చేస్తున్నారు.  అయితే శనివారం నాడు ఇచ్చిన ఆహ్వాన తాంబులంలో చీర, పంచెలు బాగున్నాయి. అయితే ఆ తరువాత రోజునుంచి పంపిణీ చేస్తున్న చీర, పంచెలను చూసి స్థానికులు ప్రభుత్వ ప్రచారార్భాటాలను గొప్పగా వున్నాయి.. కానీ తమకిచ్చిన చీర పెంచెలు మాత్రం ఇంత నాసిరకంగా వున్నాయని నవ్వుకుంటున్నారు.

పంచెకు అంచు ఉండదు....చీరకు చెంగు ఉండదు. ఏవీ వేసుకోడానికి పినికిరావు. వీటితో ఎలా అని రాజధాని రైతులు బిక్కమొహం వేస్తున్నారు. రాజధానికి కోట్ల రూపాయల భూములను తాము ఇస్తే.. తమకు ఇంతటి నాసిరకం చీర, పంచెలిస్తారా అంటూ రైతులు మండిపడుతున్నారు. ప్రభుత్వం అందించిన నాసిరకం వస్త్రాలను.. అమారావతి ప్రాంతంలోని అనంతవరం, బోరుపాలెం, అబ్బరాజుపాలెం గ్రామాల రైతులు తిరస్కరించారు. కొంతమంది అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్య ధోరణి వల్లే ఇటువంటి పరిస్థితి తలెత్తిందని వాపోతున్నారు.

ఈ వస్త్రాలు ఇవ్వకపోయినా బాగుండేదని ఇచ్చి తమను అవమానించారని అమరావతి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సుమారు రూ.5 కోట్ల వ్యయంతో కొనుగోలు చేసిన వస్త్రాల్లో నాణ్యత లోపించడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజధాని పరిధిలోని అప్పలరాజుపాలెం, అనంతవరం, బోరుపాలెం, తుళ్లూరు, వెంకటపాలెం వంటి గ్రామాల్లో మరింత నాసిరకం బట్టలు రావడంతో వారు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. వస్త్రాల కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయని రైతులు ఆరోపిస్తున్నారు. దీనిపై ప్రభుత్వం తక్షణం విచారణ జరిపించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : amaravati  farmers  invitation  clothes  Inferior quality  ap government  

Other Articles