ATS nabs wanted man from Hyderabad

Ats nabs wanted man from hyderabad

Hyderabad, terrorist, Gujarat, Ahmadabad, Terrorist Gulam

The Gujarat Anti-Terrorism Squad (ATS) Tuesday arrested a wanted man from Hyderabad in connection with 2003 alleged “jihadi conspiracy”case. The man, originally from Ahmedabad, was evading the law for the past 12 years. He is also alleged to have played a role in the murder of BJP leader Haren Pandya.

హైదారాబాద్ లో మరో ఉగ్రవాది అరెస్ట్

Posted: 10/21/2015 09:27 AM IST
Ats nabs wanted man from hyderabad

దేశంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా దానికి వెనకాల ఉన్న ఎలాంటి ఉగ్రవాద సంస్థ ఉన్నా కానీ మూలాలు మాత్రం హైదరాబాద్ నగరంతో ఖచ్చితంగా సంబందాలను కలిగి ఉంటాయి. తాజాగా హైదరాబాద్ లో మరో ఉగ్రవాదిని పోలీసులు అరెస్టు చెయ్యడం కలకలం రేపుతోంది. ఉగ్రవాది గురించి పక్కా సమాచారం అందుకున్న పోలీసులు అతడిని చాకచక్యంగా పట్టుకున్నారు. 2003 అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడు గులాం జాఫర్ ను గుజరాత్ పోలీసులు అరెస్టు చేశారు. సికింద్రాబాద్ బేగంపేటలోని ఓ ఇంట్లో టైలర్ గా పని చేస్తున్న ఉగ్రవాది గులాం జాఫర్ ను గుజరాత్ ఏటీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. ఐఎస్ఐఎస్, లష్కరేతోయిబా, జైష్ ఈ మహ్మద్, ఎల్ఈటీ సంస్థలతో సంబందాలు కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో కూడా ఐఎస్ఐఎస్ ఉగ్రవాదలును రిక్రూట్ చేసేందుకు ఓ మహిళా ఉగ్రవాది పని చేస్తున్నట్లు పోలీసులు
సమాచారం అందుకొని అరెస్టు చేశారు.

తాజాగా గులాం జాఫర్ అరెస్టుతో ఇంకా ఎవరైనా ఉగ్రవాదులు ఇలా దొంగచాటుగా హైదరాబాద్ లో ఉంటున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. గుజరాత్ లో జరిగిన గోద్రా అల్లర్ల తర్వాత కక్ష కట్టిన గులాం ఉగ్రవాదిగా మారాడు. 2003లో అహ్మదాబాద్ వరుస పేలుళ్లలో వేల మంది ప్రాణాలు బలకావడానికి మూలకారణమయ్యాడు. అయితే గుజరాత్ ఏటీఎస్ పోలీసులు హైదరాబాద్ లో గులాం సమాచారాన్ని అందుకుని హుటాహుటిని నగరానికి వచ్చి పక్కా ప్లాన్ తో అరెస్టు చేశారు. గులాంకు ఎవరెవరితో లింకులు ఉన్నాయి..? ఎవరు ఇతడికి సహాయం చేస్తున్నారు అన్న వివరాలు పోలీసులు రాబట్టాల్సి ఉంది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hyderabad  terrorist  Gujarat  Ahmadabad  Terrorist Gulam  

Other Articles