Elaborate Arrangements at Amaravati

Elaborate arrangements on for foundation laying ceremony of andhra pradesh capital

Andhra Pradesh Capital, Andhra Pradesh new capital, N Chandrababu Naidu, Amaravati, Vijaya Dasami, Amaravati News, Amaravathi News, Amaravathi updates, chandrababu on Amaravati, Modi to amaravati, Modi in Amaravathi

Elaborate arrangements are underway for the foundation stone laying ceremony of Andhra Pradesh capital city Amaravati near in Vijayawada by Prime Minister Narendra Modi on October 22. Chief Minister N Chandrababu Naidu on Monday held a review with senior officials on the arrangements for the event which is likely to see a few lakh people attending, an official release said.

అమరావతి అంకురార్పణకు అంతా సిద్దం

Posted: 10/20/2015 09:07 AM IST
Elaborate arrangements on for foundation laying ceremony of andhra pradesh capital

అమరావతి అంకురార్పణకు అంతా సిద్దమైంది. ఆంధ్రుల చరిత్రలో మరిచిపోలేని ఘట్టానికి ఏపి సర్కార్ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఏపి సిఎం నారా చంద్రబాబు నాయుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అమరావతి శంకుస్థాపనకు దాదాపుగా అన్ని పనులు పూర్తయ్యాయి. దేశ విదేశాల నుంచి రాజకీయ, వర్తక, వాణిజ్య, పారిశ్రామిక, సినీ, ఆధ్యాత్మిక ప్రముఖుల తరలిరానున్న నేపథ్యంలో ప్రభుత్వం అన్ని రకాల చర్యలూ తీసుకుంటుంది. ప్రజా రాజధాని అమరావతికి శంకుస్థాపన చేసేందుకు బాబు సర్కార్ అహోరాత్రులు కృషిచేస్తుంది. కలల రాజధాని నిర్మాణానికి వేలాది మంది మహాసంకల్ప యజ్ఞంలో కృషి చేస్తున్నారు. ప్రతి ఆంధ్రుడు ఇది నా రాజధాని అని గర్వంగా చెప్పుకునే క్రమంలో ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి.

ఆంధ్రుల చరిత్రలో ఎన్నటికీ మరిచిపోలేని విధంగా అమరావతి శంకుస్థాపనకు ఏపి సర్కార్ అన్ని రకాలుగా ప్రయత్నిస్తోంది. వేదిక దగ్గరి నుండి వచ్చిన వారికి వడ్డించే భోజనాల వరకు అన్నీ కూడా స్పెషల్ గా ఉండేట్లు చంద్రబాబు సర్కార్ చాలా పక్కాగా ప్లాన్ చేస్తోంది. అమరావతికి వచ్చిన అతిథులకు అదిరిపోయేలా దాదాపు 1200 నుండి 1500 వరకు ఖర్చు చేసి మరీ అదిరిపోయేలా.. నోటికి రుచి చిరకాలం గుర్తుండేలా చంద్రబాబు సర్కార్ ఆంధ్రా రుచులను అందించనుంది.

తుళ్లూరు మండలం ఉద్దంఢరాయుని పాలెంలో పది రోజులుగా నిరంతరం వేలాదిమంది కూలీలు, అధికారుల కష్టానికి ప్రతిఫలంగా ఏర్పాట్లన్నీ ఓ రూపు సంతరించుకుంటున్నాయి. శంకుస్థాపన ప్రాంగణంలో ప్రధాని మోడీ, సీఎం బాబు, జపాన్, సింగపూర్ దేశాల ప్రతినిధులతో పాటు మరో 11 మంది కూర్చునేలా ప్రధాన వేదిక ముస్తాబవుతోంది. ప్రధాన వేదికకు ఇరువైపులా మరో రెండు వేదికలు శరవేగంగా ఏర్పాటవుతున్నాయి. ఈ వేదికలపై ఇతర రాష్ట్రాల సీఎంలు, మంత్రులు, పారిశ్రామికవేత్తలు, విదేశీ ప్రతినిధులు, న్యాయప్రముఖులు మొత్తంగా 700 మంది ఆసీనులవుతారు. ప్రధాన వేదికకు పక్కగా యాగశాల ఏర్పాటు చేశారు. ఇక్కడే ప్రధాని మోడీ శంకుస్థాపన చేస్తారు. ప్రధాన వేదికకు ఎదురుగా సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శనకు ఓ స్టేజ్ ఏర్పాటు చేశారు. అన్నిటికీ మించి రాజధాని నిర్మాణానికి సహకరిస్తూ భూములిచ్చిన 29 గ్రామాల రైతు కుటుంబాలకు భారీ గ్యాలరీని, రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే ప్రజానీకం కోసం మరో గ్యాలరీని ఏర్పాటు చేశారు. మొత్తం 34 గ్యాలరీలు ఏర్పాటు చేశారు. శంకుస్థాపనను తిలకించేందుకు ఎల్.ఈ.డీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు.

అమరావతి శంకుస్థాపన లాంటి బారీ కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. భద్రతరీత్యా విస్తృతస్థాయిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల మానిటరింగ్కు కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. అన్ని శాఖల సమన్వయానికి మరో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. మరోవైపు విజయవాడ, గుంటూరు నుంచి ఉద్దండరాయునిపాలెం వెళ్లే రహదారుల విస్తరణ పనులు పూర్తయ్యాయి. అమరావతి అంకురార్పణకు వచ్చే ప్రాంతాలు అన్నీ కూడా కొత్త రూపు సంతరించుకుంటున్నాయి. కొత్త వెలుగులతో ఆంధ్రుల రాజధానికి శ్రీకారం.. దసరా ముహూర్తాన పడనుంది. మోదీతో పాటు, జపాన్, సింగపూర్ ప్రతినిధులకు చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా దృష్టిసారించారు. వారికి ఆతిథ్యం అదిరిపోయేలా ప్లాన్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles