Rahul Gandhi wrote a letter to Modi

Rahul gandhi wrote a letter to modi

Rahul Gandi, AP, Special Status, Modi, Sonia Gandhi, Amaravati, Modi on AMaravati, Rahul on AP Congress, Rahul Gandhi letter

AICC Vice President Rahul Gandhi wrote a letter to Pm Modi about ap special status. He demand to implement the previous govt words on special status for ap.

మోదీ గారికి.. రాహుల్ రాయునది ఏపి గురించి

Posted: 10/19/2015 03:56 PM IST
Rahul gandhi wrote a letter to modi

ఆంధ్రప్రదేశ్ మీద కాంగ్రెస్ పార్టీ యువరాజు రాహుల్ గాంధీకి ప్రేమ ఎక్కువైంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీని సమాధిలో పెట్టేసిన ఏపి ప్రజలను ఇంప్రెస్ చెయ్యడానికి రాహుల్ గాంధీ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అందులో బాగంగా గత వారంలోనే రఘువీరా రెడ్డితో పలువురు ఏపి కాంగ్రెస్ నాయకులకు రాహుల్ స్పెషల్ క్లాస్ తీసుకున్నారు. తాజాగా ఏపికి  ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ లేఖ రాశారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని మోదీ నిలబెట్టుకోవాలని లేఖలో కోరారు. ప్రత్యేక హోదా ఇస్తే ఏపీ అభివృద్ధి చెందుతుందని కావున దీనిపై త్వరగా తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఒక పేజీ లేఖలో రాహుల్ అనేక విషయాలను పేర్కొన్నారు. ఇటీవల తాను రెండుసార్లు ఏపీలో పర్యటించిన సందర్భంలో ఎన్నికల హామీలు నెరవేర్చలేదని ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని లేఖలో తెలిపారు.
 
విభజన సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చి ఏపీకి న్యాయం చేయాలన్నారు. ప్రత్యేక హోదా వల్ల మిగిలిన రాష్ట్రాలతో కలిసి ఏపీ అభివృద్ధిలో ముందుకెళ్తుందని చెప్పారు. ఈనెల 22న జరిగే ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమంలో ప్రత్యేక హోదాపై ప్రకటన చేయాలని రాహుల్ లేఖలో విజ్ఞప్తి చేశారు. గతంలో ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ లేఖ రాసిన విషయం తెలిసిందే. మొత్తానికి మొన్నామధ్య తల్లి సోనియా గాంధీ రాసిన లెటర్ కు ఎలాంటి జవాబు ఇవ్వని మోదీ మరి రాహుల్ గాంధీ రాసిన లేఖకు ఎలా స్పందిస్తారో చూడాలి. ఏపి రాజధాని అమరావతి శంకుస్థాపనకు టైం దగ్గర పడిన టైంలో  రాహుల్ గాంధీ ఏపి కాంగ్రెస్ వర్గాలకు ఉత్సాహాన్ని నింపడానికి.. కాంగ్రెస్ పై ప్రజలకు కాస్త మంచి అభిప్రాయం ఏర్పడేలా రాహుల్ మోదీకి లేఖ రాశారు. మరి ఇది ఎంత వరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles