Benazir Bhutto Assassination Case: Musharraf Responsible For Pakistan Prime Minister's Death, Witness Siegel Claims

Parvez musharraf was responsible for assasination of benazir bhutto

pervez musharraf benazir bhutto, benazir bhutto pervez musharraf, benazir bhutto assassination, benazir bhutto pervez musharraf involved, mark siegel allegations pervez musharraf benazir bhutto, benazir bhutto pervez musharraf 2015 mark siegel, pakistan

2007 assassination of former Pakistani Prime Minister Benazir Bhutto lies with ex-military director and former President Pervez Musharraf, according to her friend and American journalist Mark Siegel

బెనజిర్ బుట్టో హత్యకు కుట్ర చేసింది పర్వేజ్ ముషరఫ్..

Posted: 10/18/2015 12:59 PM IST
Parvez musharraf was responsible for assasination of benazir bhutto

పాకిస్తాన్ మాజీ ప్రధాని బెనజిర్ బుట్టో హత్యకు పాక్ సైనిక నియంత పర్వేజ్ ముషారఫే కారణమని అమెరికన్ జర్నలిస్ట్ మార్క్ సీగల్ తెలిపారు. బుట్టో హత్యకేసులో రావల్పిండి కోర్టులో ఆయన సాక్ష్యం చెబుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. ముషారఫ్ నుంచి తనకు బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నట్టు భుట్టో తనతో చాలాసార్లు మొరపెట్టుకున్నట్టు ఆయన వివరించారు. ఈనెల ఒకటిన పాకిస్తాన్‌లోని రావల్పిండి టెర్రరిజమ్ కోర్టు ఎదుట వాషింగ్టన్‌లోని పాక్ ఎంబసీ నుంచి వీడియో లింకేజీ ద్వారా హాజరైన సీగల్ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

బెనజిర్ బుట్టో హత్య కుట్రకు సంబంధించి ఇద్దరు వ్యక్తుల మధ్య నడిచిన ఫోన్ సంభాషణను గల్ఫ్ దేశానికి చెందిన ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఒకటి ట్రేస్ చేసిందని పేర్కొన్నారు. ఈ సంభాషణను బట్టి ముషారఫ్ సహచరులు ముగ్గురు ఈ కుట్రలో భాగస్వాములుగా ఉన్నట్టు తెలుస్తోందని పేర్కొన్నారు. భుట్టో హత్యకు ముషారఫే కారణమని, దానికి ఆయనే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. 1998 నుంచి 2008 వరకు పాక్‌ను పాలించిన ముషారఫ్(72) నుంచి భుట్టో పలుమార్లు బెదిరింపులు ఎదుర్కోవడం దీనికి బలాన్ని ఇస్తోందని సీగల్ వాంగ్మూలం ఇచ్చారు.

తన రక్షణకు ఫారిన్ సెక్యూరిటీని రప్పించాలని బెనజిర్ భుట్టో చాలాసార్లు ముషారఫ్‌ను అభ్యర్థించినా ఆయన పెడచెవిన పెట్టారని సీగల్ పేర్కొన్నారు. బాంబు దాడిలో బెనజీర్ చనిపోవడానికి ముందు ఆమె సెక్యూరిటీ సిబ్బందికి ముషారఫ్ మొబైల్ జామర్స్ ఇచ్చినా అవి పనిచేయలేదని తన వాంగ్మూలంలో పేర్కొన్నారు.ముషారఫ్ పాక్ అధ్యక్షుడిగా ఉండగానే రెండుసార్లు పాక్ ప్రధానిగా పనిచేసిన బెనజిర్ భుట్టో 2007లో రావల్పిండిలో జరిగిన బాంబుదాడిలో మరణించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ముషారఫ్ ప్రధాన నిందితుడిగా ఉన్నారు. అయితే తనపై ఉన్న ఆరోపణలను ముషారఫ్ కొట్టివేశారు. మరోవైపు చాలా ఏళ్లుగా సాగుతున్న ఈ కేసులో సీగల్ వాంగ్మూలం కీలకం కానుంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Benazir Bhutto  Assassination Case  Pervez Musharraf  Witness Mark Siegel  

Other Articles