A Hyderabadi Person Muhammad Ibrahim Cheated By Nigerian Person's E-mail | Delhi Crime News | E-mail Crime News

Email fraud muhammad ibrahim father died cheated by nigerian person delhi crime news

email fraud, email crime news, nigerian email fraud, muhammad ibrahim, hyderabad crime news, social media crime, social media updates, gmail crime news, cyber crime news, hyderabad cyber crimes

Email Fraud Muhammad Ibrahim Cheated By Nigerian Person Delhi Crime News : A Hyderabadi Person Muhammad Ibrahim Cheated By Nigerian Person. That Person Send Him A Mail Which Spoiled His Life And Dad Died.

ఒక ‘ఈ-మెయిల్’ మోసం.. తండ్రిని బలితీసుకుంది!

Posted: 10/17/2015 10:51 AM IST
Email fraud muhammad ibrahim father died cheated by nigerian person delhi crime news

సాంకేతిక పరిజ్ఞానాన్ని కొందరు దుండగులు అడ్డదారులకు వినియోగించుకుంటున్న సంఘటనలు పెచ్చుమీరిపోతున్నాయి. ఇటువంటి మోసాలకు గురైన వ్యక్తుల జీవితాలు అర్థంతరంగా ముగిసిపోతున్నాయి. ఇందుకు నిదర్శనంగా తాజాగా మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తికి వచ్చిన ‘ఈ-మెయిల్’ అతని జీవితాన్ని బజారుపాలు చేయడమే కాకుండా అతని తండ్రిని బలితీసుకుంది. తీవ్ర కలకలం రేపిన ఈ ఘటన హైదరాబాద్ నగరంలో చోటు చేసుకుంది.

సికింద్రాబాద్ లోని హస్మత్ పేటకు చెందిన మహ్మద్ ఇబ్రహీం అనే వ్యక్తికి 2008 నవంబర్ 12వ తేదీన గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఓ ఈ-మెయిల్ వచ్చింది. దానికి ఇబ్రహీం స్పందించగా.. ఆ మెయిల్ పంపిన నైజీరియన్ వ్యక్తి తనని తాను డాక్టర్ మైక్‌న్యూవిల్లీగా పరిచయం చేసుకున్నాడు. మెడికల్ ప్రాక్టీషనర్ గా పనిచేస్తున్న తన వద్ద రేసుగుర్రాలు వేగంగా పరిగెత్తేందుకు ఉపయోగించే మందు ఉందని చెప్పాడు. ఆ మందును ఉపయోగిస్తే సాధారణ మనుషులు కూడా గుర్రాన్ని మించిన వేగంతో పరుగెత్తగలరంటూ అతగాడు ఇబ్రహీంని నమ్మించాడు. ఈ మందు వ్యాపారంలో భాగస్వామి కోసం వెతుకుతున్నానని చెప్పాడు. అదే సమయంలో ఏదైనా వ్యాపారం ప్రారంభించి కాస్త డబ్బు వెనకేసుకోవాలని ప్రయత్నిస్తున్న ఇబ్రహీంకు అతగాడు ఆఫర్ వరంలా అనిపించింది. దాంతో.. ఆ నైజీరియన్ తో బిజినెస్‌ పార్టనర్‌గా ఉండేందుకు అంగీకరించాడు. ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత ఆ నైజీరియన్ వ్యక్తి ఢిల్లీ వచ్చి డబ్బు చెల్లించమని ఫోన్ ద్వారా చెప్పాడు.

వెంటనే ఢిల్లీ వెళ్లిన ఇబ్రహీం అక్కడ ఆ వ్యక్తి ఇచ్చిన మెటల్‌ బాక్స్‌ తీసుకొని తిరిగి నగరానికి వచ్చేశాడు. ఇంటికి వచ్చాక దాని కోడ్‌ నెంబర్‌ తెలుసుకొని తెరిచి చూస్తే అందులో నలుపు రంగు బండిల్స్‌ కనిపించాయి. దీనిపై నైజీరియన్‌ను ఆరాతీయగా.. అవన్నీ బ్లాక్‌ డాలర్స్‌ అని వాటిని మామూలు డాలర్లుగా మార్చేందుకు అవసరమైన కెమికల్‌ మార్క్‌ అనే వ్యక్తి వద్ద ఉందని చెప్పాడు. దీంతో ఆ బ్లాక్‌ బండిల్స్‌ తీసుకుని ఇబ్రహీం ఢిల్లీ వెళ్లి మార్క్‌ను కలిశాడు. అతగాడు బండిల్స్‌ నుంచి మూడు బ్లాక్‌ డాలర్లను తీసి, వాటికి కెమికల్‌ పూసి ఒరిజినల్‌ నోట్లుగా చూపాడు. వాటిని నగరానికి తీసుకొచ్చి మనీ ట్రాన్స్‌ఫర్‌ సంస్థలో మార్పిడి చేశాడు. దాంతో అతనికి ఆ వ్యాపారంపై నమ్మకం కుదిరింది. డబ్బులు ఎక్కువ సంపాదించుకోవచ్చునని ఆశతో ఇబ్రహీం మరిన్ని బ్లాక్‌ డాలర్లు తెప్పించాడు. అతని జీవితం ఆనందమయంగానే సాగింది. తాను త్వరలోనే డబ్బున్న వ్యక్తిగా ఎదుతానన్న ఆనందంలో మునిగిపోయాడు కానీ.. తాను మోసపోతున్నాననే విషయాన్ని ఇబ్రహీం ఏమాత్రం గ్రహించలేకపోయాడు.

ఓ సందర్భంలో ఇబ్రహీంకి ఓ వ్యక్తి ఫోన్ చేసి.. తాను ఎఫ్‌బీఐ అధికారినంటూ పరిచయం చేసుకొని, బ్లాక్‌డాలర్ల కోసం ఉపయోగించే కెమికల్‌ విషపూరితమైందంటూ బెదిరించాడు. కేసు నమోదు చేస్తానని హెచ్చరించాడు. తన ఖాతాలో చెప్పిన మొత్తాన్ని జమచేస్తే విషయం బయటపడనివ్వకుండా చేస్తానని ఆ వ్యక్తి చెప్పాడు. తండ్రి పోలీసు అధికారి.. పరువుగల కుటుంబం.. బయటకు చెబితే ప్రమాదమని భావించిన ఇబ్రహీం.. అతని బెదిరింపు భయపడి, 10 లక్షలు అతడు చెప్పిన ఖాతాలో జమచేశాడు. ఇలా వేర్వేరు కారణాలను చూపుతూ 75లక్షల వరకు వివిధ బ్యాంకుల ఖాతాల్లో జమ చేయించారు. తాను మోసపోయిన విషయాన్ని ఇబ్రహీం గోప్యంగా దాచేందుకు ప్రయత్నించాడు కానీ.. చివరకు అతని తండ్రి, కుటుంబసభ్యులకూ తెలిసిపోయింది. దీంతో తీవ్రమనోవేదనకు గురైన ఇబ్రహీం తండ్రి.. కొన్నాళ్లకే కన్నుమూశాడు. అటు కుటుంబసభ్యులు చీదరించుకుని ఇబ్రహీంను ఇంటి నుంచి వెళ్లిపొమ్మన్నారు.

భార్య, ముగ్గురు పిల్లలతో ఎటువెళ్లాలో తెలియని పరిస్థితిలో ఇబ్రహీం సైబరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులకు ఈ మొత్తం తతంగంపై ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు.. ఢిల్లీ పోలీసులకు సమాచారాన్ని తెలియజేసి, తమకు సహకరించాల్సిందిగా కోరారు. ఎంతో చాకచక్యంగా వ్యవహరించి చివరికి ఆ నైజీరియన్ మోసగాడ్ని పట్టుకోగలిగారు. ఢిల్లీ శివారు ప్రాంతం ముఖర్జీనగర్‌లో వుంటున్న ఆ నైజీరియన్‌ మోసగాడు డేవిడ్‌ ఫ్లెచర్‌ను అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి ల్యాప్‌టాప్‌, పాస్‌పోర్టు, డేటాకార్డు, యూఎస్‌బీ డ్రైవ్‌ స్వాధీనం చేసుకున్నారు. ఈ మోసానికి గురైన ఇబ్రహీం మాట్లాడుతూ.. కెరీర్‌లో స్థిరపడాలనే ఉద్దేశంతో మెయిల్‌కు రెస్పాన్స్‌ ఇవ్వటంతో తాను మోసపోయానని ఏడేళ్లు ఎంతో ఇబ్బంది పడ్డానని, ఇటువంటి మెయిల్స్ కు స్పందించకుండా వుంటే మంచిదని సూచించాడు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : email fraud  nigerian mail fraud cases  hyderabad cyber crime case  

Other Articles