PM modi| narendra modi maritial status| modi on maritial status| supreme court

Sc dismisses plea against prime minister narendra modi

Prime Minister Narendra Modi, modi, PM modi, Supreme Court, modi concealing information, modi about his marital status, 2012 gujarat assembly polls, 2014 parliament elections, modi maritial status

The Supreme Court on Friday dismissed a petition seeking initiation of proceedings against Prime Minister Narendra Modi for allegedly concealing information about his marital status during 2012 assembly polls.

మోడీకి సమసిన సతి పేరు కష్టాలు.. ప్రధానికి ఊరట..

Posted: 10/16/2015 01:34 PM IST
Sc dismisses plea against prime minister narendra modi

ప్రధానమంత్రి నరేంద్ర దామోదర్ దాస్ మోడీకి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆయనకు వ్యతిరేకంగా ధాఖలైన పిటీషన్ ను న్యాయస్థానం ఇవాళ కోట్టివేసింది. దీంతో గత కొన్నాళ్లుగా ఆయన ఈ విషయమై పడుతున్న ఇబ్బందులు సమసిపోయినట్టయ్యాయి. సతి పేరును ఎన్నికల అఫిడెవిట్ లో పొందుపర్చడం పతి ఇష్టానుసారమని, ఈ విషయంలో తప్పుడు సమాచారం పోందుపర్చారని ఎవరిపైనైనా ఎలా చర్యలు తీసుకుంటామని జస్టిస్ చలమేశ్వర్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది.

గుజరాత్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికలలో నరేంద్ర మోడీ తన సతి పేరు కోసం కేటియించిన బ్లాంక్ ను ఖాళీగా వదిలేసి.. సార్వత్రిక ఎన్నికలలో మాత్రం తన భార్య పేరును అఫిడెవిట్ లో పోందుపర్చారని, దీంతో నరేంద్రమోడీ రెండేళ్ల వ్యవధిలో జరిగిన రెండు వేర్వేరు ఎన్నికలలో తన సతి పేరు విషయమై తప్పుడు సమాచారం అందించారని గుజరాత్ లోని అహ్మదాబాద్ నివాసి నిషాంత్ వర్మ.. గుజరాత్ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటీషన్ ను విచారణార్హం కాదని సదరు న్యాయస్థానం తోసిపుచ్చడంతో.. ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కాగా నిశాంత్ వర్మ వేసిన పిటీషన్ పై విచారించిన సుప్రీం ధర్మాసనం.. ఈ పిటీషన్ కు అంత్య ప్రాధాన్యత క్రమాన్ని ఇవ్వలేమంటటూ కోట్టివేస్తూ.. గుజరాత్ హైకోర్టు వ్యాఖ్యలను సమర్థిందించింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : PM modi  narendra modi maritial status  modi on maritial status  supreme court  

Other Articles