Aadhaar card for all needs

Aadhaar card for all needs

Aadhaar Card, Aadhar Card, Aadhaar Card case in Supreme Court, Aadhaar card not mandatory, Aadhaar card privacy, Aadhar card for citizens of India

The Aadhaar Card may be used to avail government schemes including employment guarantee, pension and bank accounts, the Supreme Court said today. Earlier, as per the court's order, the card could have been used only voluntarily for availing subsidies under the public distribution system and purchasing kerosene and cooking gas.

ఆధార్ కార్డే అన్నిటికి ఆధారం

Posted: 10/16/2015 11:38 AM IST
Aadhaar card for all needs

ఆధార్ కార్డ్ ఉంచాలా వద్దా..? అన్నింటికి ఆధార్ అవసరమా..? అన్న చర్చకు తెర పడింది. సుప్రీంకోర్ట్ లో ఎన్నో సార్లు వాదనలకు వచ్చిన ఆధార్ కార్డ్ మీద సుప్రీం కోర్ట్ మొత్తానికి స్పష్టతనిచ్చింది. ఎల్పీజీ సబ్సిడికి ఆధార్ అనుసంధానాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్ట్ తర్వాత అందుకు అనుమతించింది. తాజాగా ప్రభుత్వం చేపడుతున్న పలు సామాజిక పధకాలకు కూడా ఆధార్ ను అనుసందానం చేసుకోవచ్చిన స్పష్టం చేసింది. ఆధార్ కార్డును పెన్షన్, పిఎఫ్, జన్‌ధన్‌యోజన, మహాత్మాగాంధీ నేషనల్ రూరల్ గ్యారంటీ స్కీమ్‌లకు ఉపయోగించవచ్చని సుప్రీంకోర్టు తెలిపింది. తొలుత ఆధార్‌ తప్పనిసరి కాదన్న అత్యున్నత న్యాయస్థానం ఆ తర్వాత తాజాగా ఆధార్‌ను ప్రభుత్వ స్కీమ్‌లకు ఉపయోగించవచ్చని స్పష్టం చేసింది. దీంతో ఆధార్‌కార్డుల వినియోగంపై ఉన్న ఆంక్షలు తొలగినట్లైంది. ఆధార్ కార్డు కోసం వ్యక్తిగతమైన వివరాలు ఇచ్చినందున అవి దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందని తొలుత సుప్రీంకోర్టు వ్యతిరేకించింది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వ వినతి మేరకు తన ఆంక్షలను తొలగించింది.

యుపిఎ ప్రభుత్వం తీసుకువచ్చిన ఆధార్ కార్డుల మీద సుప్రీంకోర్ట్, హైకోర్ట్ పరిధిలో చాలా కేసులు నమోదయ్యాయి. ఆధార్ ఖచ్చితంగా ఇవ్వాలన్న ప్రభుత్వాల నిర్ణయం మీద చాలా మంది పిల్ దాఖలు చెయ్యడం జరిగింది. అయితే కేంద్ర ప్రభుత్వం ఆధార్ కార్డుల అనుసంధానం అవసరాన్ని కోర్ట్ కు వివరించింది. అదే సమయంలో ఆధార్ కార్డ్ లో ఉన్న పర్సనల్ డిటేల్స్ ను కూడా ఎవరూ చూడలేరని స్పష్టతనిచ్చింది. దాంతో సుప్రీంకోర్ట్ ఆధార్ కార్డ్ అనుసంధానికి అనుమతినిచ్చింది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles