Flipkart's Big Billion Days Sale: Moto X Play to Lenovo K3 Note, top mobile deals

Flipkart sells half a million smartphone handsets in 10 hours

flipkart offers today, flipkart offers today on mobiles, flipkart offers on mobile, big billion day, big billion day offers, big billion day offers list, flipkart big billion day offers 2015, flipkart big billion day mobile offers, flipkart big billion sale, mobile deals, mobile deals today, mobile deals flipkart

Flipkart's Big Billion Days sale has offers on mobiles, smartphones today. From Moto X Play to Lenovo k3 Note to xioami 5 lakh phones sold out in 10 hours

ఫ్లిప్ కార్ట్ రికార్డు.. గంటల వ్యవధిలో అర మిలియన్ స్మార్ట్ ఫోన్ల అమ్మకం

Posted: 10/15/2015 08:36 PM IST
Flipkart sells half a million smartphone handsets in 10 hours

ఆపర్లు వుంటే చాలు.. అది అవసరమా..? కాదా..? అన్న అలోచన కూడా మదిలోకి రానీయకుండా కారు చౌకగా వచ్చిందని దానిని కొని సంబరపడిపోతాడు సగటు భారతీయుడు. ఈ విషయాన్ని గ్రహించిన ఈ కామెర్స్ సంస్థలు.. భారతీయులకు ఆపర్ల వల విసిరి సోమ్మ చేసుకోవడం.. అవసరమైతే.. రికార్డులను సృష్టించడం కూడా చేస్తుంటాయి. ఏడాదిలో మూడు నాలుగు పర్యాయాలు ఆపర్ల వల విసిరి తమ సంస్థలో అమ్మాకాలను సాగిస్తుంటాయి. ఇప్పుడిదే కోవలోకి చేరింది ఈ కామెర్స్ అగ్రసంస్థ ఫ్లిప్ కార్ట్.

తాజాగా బిగ్ బిలియన్ డే సేల్ అన్న పేరుతో భారతీయు జేజుల్లను దోచేస్తుంది. ఎంతలా అంటే..  అమ్మాకాలలోనూ రికార్డులను సాధించేలా. నమ్మశక్యంగా లేదా..? స్వయంగా ఫ్లిప్ కార్ట్ సంస్థే ఈ విషయాన్ని ప్రకటించింది. బిగ్ బిలయన్ డే సేల్ ప్రత్యేక ఆపర్ లో ఇవాళ ప్రారంభమైన మొబైల్ ఫోన్ అమ్మకాల్లో సరికొత్త రికార్డు సాధించామని సంస్థ ప్రకటించింది. 10 గంటల్లోనే 5 లక్షల ఫోన్లు విక్రయించామని తెలిపింది. దేశంలో ఇంత తక్కువ సమయంలో ఆన్ లైన్, ఆఫ్ లైన్ లో ఇన్ని ఫోన్లు అమ్మడం ఇదే మొదటిసారి అని ఫ్లిప్ కార్ట్ ఒక ప్రకటనలో తెలిపింది.

బెంగళూరు, ఢిల్లీ, ముంబై వంటి మెట్రో నగరాలతో పాటు నాగపూర్, ఇండోర్, కోయంబత్తూరు, విశాఖపట్నం, జైపూర్ వంటి నగరాల్లోనూ అమ్మకాలు జోరెత్తాయని వెల్లడించింది. 4జీ ఫోన్లు ఎక్కువగా కొన్నారని, 10 గంటల్లో 75 శాతం 4జీ ఫోన్లు అమ్ముడయ్యాడని తెలిపింది. భారత్ లో స్మార్ట్ ఫోన్లకు పెరుగుతున్న డిమాండ్ కు తాము సాధించిన రికార్డు అద్దం పడుతోందని ఫ్లిప్ కార్ట్ వాణిజ్య విభాగం అధిపతి ముఖేష్ బన్సల్ అన్నారు. 'బిగ్ బిలియన్ డేస్ సేల్' ఈనెల 17వరకు కొనసాగుతుంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : flipkart  smartphones  big billion day sale  flipkartoffers  5 lakh mobiles  

Other Articles