Donkeys milk costs six thousand rupees

Donkeys milk costs six thousand rupees

Donkey, Donkey milk, Adilabad, Manchiryala, Anaarthi, Donkey milk for Health, Donkey milk for fitness

Believe it or not! The donkey milk, which is more costly than any premium branded dairy milk, is still popular in the region as it is believed to be having lots of medicinal values to cure breathing ailments, cold, cough, etc. among the children.

లీటరు పాల ధర ఏకంగా ఆరువేల రూపాయలు

Posted: 10/15/2015 11:22 AM IST
Donkeys milk costs six thousand rupees

బల్లు ఓడలు.. ఓడలు బల్లు కావడం అంటే ఇదే. ఒకప్సుడు ఎందుకూ కొరగావు అనుకున్నవే.. అమూల్యంగా మారాయి. పదిహేనేళ్లకొకసారి పెంటకుప్పకు కూడా టైం వస్తుంది అంటుంటారు పెద్దలు. టైం వస్తే దేనికైనా దశ తిరుగుతుంది. తాజాగా పాల ధర ఆరు వేలు పలుకుతోంది. అవును మీరు చదువుతున్నది అక్షరాల నిజం.. అచ్చంగా ఆరువేల రూపాయలు చెల్లిస్తేనే లీటరు పాలు దొరుకుతాయి. లేదంటే లేదు. కానీ ఆ పాలకోసం జనాలు క్యులు కడుతున్నారు. అడ్వాన్స్ లు ఇచ్చిమరీ పాలు బుక్ చేసుకుంటున్నారు. ఇంతకీ ఏం పాలు అనుకుంటున్నారా..? గాడిద పాల క్రేజ్ గురించి ఇప్పటి దాకా మాట్లాడాం. అవును గాడిద పాలకు పెరగిన క్రేజ్ వల్ల లీటరు పాల ధర ఏకంగా ఆరు వేలకు చేరింది. అసలు అంత ధర ఎందుకు అనే దానికి సమాధానం కావాలంటే మొత్తం స్టోరీ చదవండి.

ఇంతకీ విషయమేమిటంటే.. గాడిద పాలు తాగితే ఉబ్బసం, అజీర్తి, కీళ్ల నొప్పులు వంటి పలు రోగాలు మటుమాయమవుతాయన్న నమ్మకంతో పలువురు ఆ పాల కోసం ఎగబడ్డారు. దీంతో గిరాకీ పెరిగి లీటరు రూ.6 వేలకు అమ్మారు. ఒక్కో గాడిద రోజుకోసారి 200 నుంచి 250 మిల్లీ లీటర్లు మాత్రమే పాలు ఇవ్వడంతో బుధవారం పాలు దొరకని వారు మర్నాడు పాలు తమకే ఇచ్చేలా అడ్వాన్సు కూడా చెల్లించారు. అజీర్తి, ఉబ్బసంతో బాధపడేవారికి గాడిద పాలు మంచి ఔషధమని గాడిదల పెంపకందారుడు మాచర్ల కాలయ్య చెప్పారు. అనేక చోట్ల లీటర్లు రూ.2 వేల వరకూ పలుకుతుండగా అనపర్తిలో ఏకంగా 6 వేల వరకూ పెరగడం విశేషం. ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా చాలా ఏరియాల్లో ఈ గాడిద పాల క్రేజ్ సాగుతోంది. టైం అంటే ఇదేనేమో మరి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Donkey  Donkey milk  Adilabad  Manchiryala  Anaarthi  Donkey milk for Health  Donkey milk for fitness  

Other Articles