Baby born on board long haul flight

Baby born on board long haul flight

baby Birth, Birth in Flight, China Airlines, Baby born on board

A woman has given birth during a Los Angeles-bound China Airlines flight after unexpectedly going into labour. The baby girl was delivered by a doctor who happened to be on the flight from Bali on Thursday.

ITEMVIDEOS: వాడు నిజంగా గాలిలో పుట్టాడు

Posted: 10/14/2015 01:35 PM IST
Baby born on board long haul flight

గాలిగాడు అనే మాట మనం వింటూ ఉంటాం. పని పాట లేకుండా రోడ్ల మీద తిరిగే పనిలేని వ్యక్తులకు ఇలా ప్రేమతో గాలిగాడు అని సంబోదిస్తారు. అయితే గాల్లో లెక్కలు వేస్తున్నావ్.. గాల్లో మేడలు కడుతున్నావ్ అని అంటుంటారు. అయితే ఎవరైనా ఇంట్లో పుడతారు.. హాస్సిటల్లో  పుడతారు.. కానీ ఒకడు మాత్రం గాలిలో పుట్టాడు. అవును మీరు చదువుతున్నది నిజమే గాలిలోనే పుట్టాడు. అనుకోకుండా జరిగిన ఈ ఘటనకు అందరూ షాక్ అయ్యారు. ఇంతకీ మ్యాటర్ ఏంటీ అంటే ఓ గర్భవతి విమానంలో ప్రయాణిస్తోంది... ప్రయాణం మధ్యలో ఉన్నప్పుడు.. విమానం గాలిలో తేలుతున్నప్పుడు గర్భవతికి పురిటి నొప్పులు వచ్చాయి. దాంతో ఏం చెయ్యాలో అర్థంకానీ ప్యాసింజర్లు, ఎయిర్ హోస్టెస్ లు ఏం చేశారో తెలుసా..?

చైనా ఎయిర్ లైన్స్ లో ఓ నిండు గర్భిణి లాస్ ఏంజెల్స్ నుండి ప్రయాణమైంది. విమానం గాలిలో 3వేల అడుగుల ఎత్తులో ఉండగా.. పురిటి నొప్పులు వచ్చాయి. దాంతో ప్రయాణికుల్లో కలవరం రేగింది. కానీ ప్రయాణికుల్లో ఓ డాక్టర్ ఉన్నారు. అక్కడే ఉన్న ఎయిర్ హోస్టెస్ లు సహకరించారు. అయితే ఆ మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. కాగా ఇదంతా ఓ ప్రయాణికుడు వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. డెలివరి తర్వాత ఎయిర్ హోస్టెస్ బిడ్డను ఎత్తుకొని ఎక్సైట్ కావడం వీడియోలో చూడొచ్చు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : baby Birth  Birth in Flight  China Airlines  Baby born on board  

Other Articles