Shiv Sena likens Sudheendra Kulkarni to Ajmal Kasab, slams Devendra Fadnavis

People like kulkarni are threat to india s sovereignty says shiv sena

sudheendra kulkarni, shiv sena workers, shiv sena, shiv sena, shiv sena activists, sudheendra kulkarni, sudheendra kulkarni shiv sena, shiv sena sudheendra kulkarni, kasuri book launch, khurshid mahmud kasuri book, shiv sena party, shiv sena news, mumbai news, india news

Unfazed by all-round criticism for blackening Sudheendra Kulkarni's face for his refusal to cancel Pakistan's former foreign minister Khurshid Mahmud Kasuri's book launch, Shiv Sena today likened the ORF chief to 26/11 terrorist Ajmal Kasab.

దేవేంద్ర పడ్నవీస్ పై విమర్శలు గుప్పించిన శివసేన.. మరాఠీగడ్డపై కళంకం

Posted: 10/13/2015 10:26 PM IST
People like kulkarni are threat to india s sovereignty says shiv sena

ముఖ్యమంత్రి ఫడ్నవీస్ మహారాష్ట్రను అర్థం చేసుకోవడంలో విఫలమయ్యారని శివసేన విమర్శించింది. రాష్ట్రంలో బీజేపీతో తెగదెంపులు చేసుకోవాలని భావిస్తున్న శివసేన ఏకంగా ముఖ్యమంత్రినే టార్గెట్ చేసింది. పాకిస్థాన్ మాజీ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఖుర్షీద్ కసూరి పుస్తకావిషర్కణకు వ్యతిరేకంగా ఆందోళనలు చేయడం రాష్ట్రానికి అవమానకరమని ఫడ్నవీస్ చేసిన వ్యాఖ్యలను శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తిప్పికొట్టారు. కసూరిని వెనకేసుకొచ్చిన ముఖ్యమంత్రే ఛత్రపతి శివాజీ మహనీయుడి గడ్డ అయిన మహారాష్ట్రకు చెడ్డ పేరు తెచ్చారని ఆరోపించారు.

కసూరికి భద్రత కల్పించాలని పోలీసులను ఆదేశించడం 26/11 ముంబై టెర్రర్ ఎటాక్‌లో అసువుల బాసిన పోలీస్ ఉన్నతాధికారులను అవమాన పరచడమేనని ఆయన అన్నారు. పాకిస్థాన్‌పై పోరాటం నేరమైతే.. ఆ నేరాన్ని చేసేందుకు శివసేన ఎప్పుడూ సిద్ధమేనని సంజయ్ రౌత్ అన్నారు. శివసేన ఆందోళనల నేపథ్యంలో గట్టి పోలీసుల భద్రత మధ్య వర్లీలో సోమవారం సాయంత్రం కసూరి పుస్తకావిష్కరణ జరిగింది. కార్యక్రమ సహ నిర్వాహకుడు సుధీంద్ర కులకర్ణిపై నల్లరంగు పోసి అరెస్టైన ఆరుగురు శివసేన కార్యకర్తలు మంగళవారం బెయిల్‌పై విడుదలయ్యారు. జైలు నుండి విడుదలవుతూనే వారు శివసేన అధినేత ఉద్దవ్ ఠాకరే వద్దకు వెళ్లగా, వారిని ఆయన భుజం తట్టి వారిని అభినందించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sudheendra Kulkarni  Shiv Sena  Khurshid Kasuri  Ajmal Kasab  26/11 terrorist  

Other Articles