congress leader rajender reddy attack on tdp leader murali with revolver

Ongress politician rajender reddy threatens tdp leader murali with revolver

congress politician threatens with revolver, congress politician rajender reddy, warangal dcc president rajender reddy, rajender reddy threatens tdp leader murali with revolver, tdp leader murali, Congress, leader Rajender reddy, TDP, Leader Murali, gun

High tensions prevailed in Warangal Hanmakonda city as congress leader rajender reddy threatens tdp leader murali with revolver over a land dispute

వీధి రౌడీలు కాదు.. రాజకీయ నాయకులే.. తుపాకులతో బెదిరింపులు

Posted: 10/13/2015 07:23 PM IST
Ongress politician rajender reddy threatens tdp leader murali with revolver

వాళ్లు నాయకులన్న విషయాన్ని మరిచారు. ప్రజా సమస్యలను పరిష్కరించే పనిలో పోటీ పడాల్సిన నేతలు.. వ్యక్తిగత వ్యవహారాలకే ప్రాధాన్యత ఇస్తు ప్రజల్లో అబాసుపాలవుతున్నారు. ఇప్పటికే రాజకీయ నేతల వ్యవహరా శైలి నేపథ్యంలో రాజకీయాల్లోకి యువత రావాలంటేనే జంకుతుంది. ఈ తరుణంలో వరంగల్ జిల్లాలోని హనుమకొండలో రెండు పార్టీలకు చెందిన జిల్లా స్థాయి నాయకులు తమ మద్య వున్న ఓ విషయంపై వివాదానికి దిగారు. అక్కడితో అగకుండా తమ అధిపత్యంలో కోసం పట్టణ పరిధిలోనే ఉద్రిక్త పరిస్థితులకు కారణమయ్యారు.

వరంగల్ జిల్లాలోని హన్మకోండలో ఓ భూవివాదం విషయంలో కాంగ్రెస్, టీడీపీ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. డీసీసీ అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి, టీడీపీ అర్బన్ అధ్యక్షుడు మురళీ మధ్య తోపులాట జరిగింది. ఒకానొక సమయంలో కాంగ్రెస్ నేత రాజేందర్‌రెడ్డి తుపాకీ తీసి మురళీని బెదిరించాడు. మిగతా కాంగ్రెస్ కార్యకర్తలు రాజేందర్‌రెడ్డిని అడ్డుకున్నారు. తుపాకీని లోపల పెట్టుకో అని సముదాయించారు. ఆ సమయంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏం జరుగుతుందో తెలియక అయోమయంలో పడ్డారు ఇరు పార్టీల నేతలు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Congress  leader Rajender reddy  TDP  Leader Murali  gun  

Other Articles