the police foiled Jagans Fasting

The police foiled jagans seven day long deeksha

Jagan, Fasting, Hunger strike, Guntur, jagan on special status, Special status for ap, AP, JaganMohanReddy, Jagan Hunger strike

the police foiled Jagans seven day long deeksha. Fasting YSRCP chief YS Jagan Mohan Reddy, who has since been shifted to the Guntur General Hospital after the police foiled his seven-day-long deeksha, has later been admitted to the Intensive Care Unit (ICU) on Tuesday morning.

ITEMVIDEOS: జగన్ దీక్ష భగ్నం

Posted: 10/13/2015 08:05 AM IST
The police foiled jagans seven day long deeksha

ఏపికి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ. వైసీపీ అధినేత జగన్ చేస్తున్న దీక్షకు బ్రేక్ పడింది. ఆరు రోజుల పాటు కొనసాగిన జగన్ నిరవధిక దీక్షను పోలీసులు భగ్నం చేశారు. జగన్ ఆరోగ్యం క్షీణించండం. కిటోన్స్ లెవెల్  3+కు పడిపోవడం, మరోవైపు దీక్షా స్థంలో వద్ద ఆందోళనలను పెరగడంతో జగన్ దీక్షను బలవంతంగా భగ్నం చేశారు. తెల్లవారు జామున పోలీసులు జగన్ను బలవంతగా ఆస్పత్రికి తరలించారు.  సరిగ్గా 4 గంటల ప్రాంతంలో దీక్షా స్థలికి వచ్చిన పోలీసులు 4.11 గంటలకు వైఎస్ జగన్ తో తొలుత మంతనాలు జరిపే ప్రయత్నం చేశారు. మరోపక్క, పోలీసులు భారీ సంఖ్యలో రావడంతో అక్కడే ఉన్న ముఖ్యనాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. వారిపై వారిపై లాఠీ చార్జి జరిపి జగన్ ను బలవంతగా దీక్ష శిబిరం నుంచి ఎత్తుకెళ్లారు. 108 వాహనంలో గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రత్యేక హోదా వచ్చే వరకు తాను దీక్ష విరమించబోనని, తన నిరాహార దీక్షను ఆపలేరని, ఒక క్రమబద్ధంగానే తాను దీక్ష చేస్తున్నాను తప్ప ఎవరికీ ఎలాంటి హానీ చేయడం లేదని జగన్ చెప్పే ప్రయత్నం చేసినా పోలీసులు ఆయన మాట వినలేదు.


అంతకముందు ప్రత్యేక హోదా కోసం ఆరు రోజుల పాటు నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోగ్యం మరింత విషమించింది. కీటోన్స్ 3+ స్థాయికి చేరుకున్నాయి. జగన్ ఆరోగ్యం మరింత క్షీణించటంతో వైఎస్ విజయమ్మ, భార్య భారతి, సోదరి షర్మిల.. ఇతర కుటుంబ సభ్యులు హుటాహుటిన దీక్షా ప్రాంగణానికి చేరుకున్నారు. కీటోన్ బాడీస్ పాజిటివ్ అంటేనే ప్రమాదకరం అని, ఇక 3+ అంటే మరింత విషమం అన్నారు వైద్యులు. గుండె, కిడ్నీ, మెదడుమీద ప్రభావం పడి.. జగన్ కోమాలోకి వెళ్లిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

వైసీపీ నేతలు జగన్ ఆరోగ్యం పై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. జగన్ దీక్షపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ ఓ కార్యకర్త దీక్షాప్రాంగణంలో ఆత్మహత్యాయత్నం చేశాడు. ఒంటిపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకునేందుకు ప్రయత్నించాడు. మిగిలినవాళ్లు అతడ్ని అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఓ వైపు కార్యకర్త ఆత్మహత్యాయత్నంతోనే టెన్షన్ నెలకొంటే.. మరోవైపు జగన్ దీక్ష శిబిరానికి దగ్గర్లో అర్ధరాత్రి.. కొందరు దుండగులు ఓ బస్సుకు నిప్పంటించారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు జగన్ దీక్షను భగ్నం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles