Battle for Bihar Begins

Battle for bihar begins

Bihar elections 2015, Bihar polls 2015, Bihar polls, Nitish Kumar, polls bihar, polls first phase, Bihar battle, Modi, Nitesh Kumar, L:aluprasad

Voting for the first of the five-phase assembly elections in Bihar has begun - polling is being held on 49 seats. The election - billed as the most crucial one in the state - witnesses the BJP and its allies making a bid to add the state to their swelling kitty, which already has Jharkhand, Maharashtra, Haryana and Jammu and Kashmir. On the other side is the 'Grand Alliance' led by Nitish Kumar - who is seeking a third straight term as chief minister - the Rashtriya Janata Dal and the Congress.

బీహార్ లో ప్రారంభమైన ఎన్నికలు

Posted: 10/12/2015 09:04 AM IST
Battle for bihar begins

బీహార్ లో తొలి దశ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఈ ఉదయం నుండి పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు బారులు తీరారు. ప్రధాని నరేంద్ర మోదీ యువ ఓటర్లకు ఓటింగ్ వేయాల్సిందిగా పిలుపునిచ్చారు. బారీగా ఓటు హక్కును వినియోగించుకోవాలని మోదీ పిలుపునిచ్చారు. బీహార్ తొలి దశలో 27 మంది బిజెపి పార్టీ అభ్యర్థులు, మరో 13 మంది రాంవిలాస్ పాశ్వాన్ పార్టీ జన్ శక్తి తరఫున కూటమిలో భాగంగా ఎన్నికల బరిలో నిలిచారు. కాగా జనతాదళ్ తరఫున 24 మంది అభ్యర్థులు, రాష్ట్రీయ జనతాదళ్ తరఫున 17, కాంగ్రెస్ తరఫున 8 మంది అభ్యర్థులు పోటీలో పాల్గొన్నారు.

బీహార్ శాసన సభ ఎన్నికల తొలిదశ పోలింగ్ ఇవాళ ప్రారంభమైంది. తొలి విడతలో భాగంగా 49 స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో 583 మంది అభ్యర్థులు బరిలోకి దిగుతున్నారు. కోటి 35లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఢిల్లీ ఎన్నికల ఫలితాలతో ఘోర పరాభవం మూటకట్టుకున్న బీజేపీ బీహార్ ఎన్నికల్లో ఎన్డీయేను గెలిపించుకుని తన పట్టుజారిపోలేదని నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తుండగా.. మరోసారి అధికారపీఠం దక్కించుకునేందుకు లాలూతో కలిసి నితీశ్ ఏర్పాటు చేసిన కూటమి ప్రతి ఒక్క అవకాశాన్నీ వినియోగించుకోవాలనుకుంటున్నది. ఈ కూటమిలో ఆర్జేడీ, జేడీయూతోపాటు కాంగ్రెస్ కూడా చేతులు కలపడం ప్రాధాన్యం సంతరించుకుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles