Only hindus to do Garba

Only hindus to do garba

Gujarat, Garbagarba in Gujarat, No non-Hindu at Garba, Navratri, Navratri Garba, VHP, Vishwa Hindu Parishad, Vibrant Navratri

Only hindus to do Garba. Right-wing groups in Gujarat have called for restricting entry of non-Hindus to Garba venues but at the state government's forthcoming annual Navratri festival, it is some Muslims who are working round the corner to make the event a success.

హిందువులు మాత్రమే గార్భా ఆడాలా.?

Posted: 10/10/2015 04:38 PM IST
Only hindus to do garba

దసరా ఉత్సవాలు మొదలయ్యాయి. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో నవరాత్రి ఉత్సవాలకు అన్నీ సిద్దమయ్యాయి. దసరా అంటే అందరికి గుర్తుకు వచ్చేది గార్భా డ్యాన్స్. సంప్రదాయ వస్తువులు ధరించి యువతీ, యువకులు ఆడే గార్భాకు ఎంతో క్రేజ్ ఉంది. ముఖ్యంగా దసరా సందర్భంగా చాలా చోట్ల గార్భా ఆడుతుంటారు. అయితే హిందు పండగ దసరా సందర్భంగా నిర్వహించే వేడుకల్లో భాగంగా గార్భా డ్యాన్స్ చేస్తారు అయితే తాజాగా గార్భా డ్యాన్స్ ఎవరు చెయ్యాలి అన్న దాని మీద చర్చ సాగుతోంది. గార్బా డ్యాన్స్ కేవలం హిందువులు మాత్రమే చెయ్యాలని అది కూడా సంప్రదాయ దుస్తులు ధరించి, నుదుట బొట్టు పెట్టుకున్న వారికి మాత్రమే అంటూ చాలా హిందు ధార్మిక సంస్థలు హెచ్చరిస్తున్నాయి. హిందు మతస్థులు కాకుండా వేరే వారికి గార్భాడ్యాన్స్ చెయ్యడానికి వీలులేదని హుకుం జారీ చేశాయి.

గుజరాత్ లో చాలా ప్రాంతాలతో పాటు, రాజస్థానలోని కుచ్ ఏరియాలో గార్భా డ్యాన్స్ కేవలం హిందువులకు మాత్రమే చేయాలంటూ.. వేరే మతస్తులకు గార్భా ఆడేందుకు అనుమతి లేదని అంటున్నాయి కొన్ని హిందు సంస్థలు. అందులో భాగంగా ఎక్కడైనా గార్భా నిర్వహిస్తారో.. వారికి హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. గార్భాకు వచ్చే వారు సంప్రదాయ వస్తువులు ధరించాలని అలాగే నుదుట బొట్టు కూడా పెట్టుకోవాలని అంటున్నారు. అయితే దీని మీద కొన్ని విమర్శలు వస్తున్నాయి. గార్భా సంప్రదాయ నృత్యమే అయినా కానీ ఆనందంతో ఏ మతస్తులు చేస్తే ఏముంది అనే వాళ్లు ఉన్నారు. అయితే హిందు సంస్థలు మాత్రం అలా ఎలా అవుతుందని ప్రశ్నిస్తున్నాయి. దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించే ఆరాధనోత్సవాలల్ో గార్భా డ్యాన్స్ కూడా ఒకటి వారంటున్నారు. వేరే మతస్తులు కేవలం ఎంటర్ టైన్ మెంట్ కోసమే ఆ గార్బా డ్యాన్స్ చేస్తారని కాబట్టి వారికి అనుమతి ఇవ్వొద్దు అంటున్నారు. కాగా గుజరాత్ లో హిందు మతస్తులు కాకుండా వేరే వారికి గార్భా డ్యాన్స్ చెయ్యకుండా వేసిన నిషేదం మీద గుజరాత్ ప్రభుత్వం స్పష్టత నిచ్చింది. అలాంటి నిషేదాలు ఏమీ లేదని అంటోంది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles