That congress senior leader not participated in Telangana bandh

Congress leader on bandh

Congress, janareddy, Bandh, Telangana bandh. Congress Janareddy, JanaReddy on Bandh

Telangana bandh going on.. but one senior congres leader not involved in the band. Congress senior leader Janareddy didnt participated in todays bandh.

ఆ కాంగ్రెస్ పెద్ద మనిషి.. బంద్ కు దూరం

Posted: 10/10/2015 01:45 PM IST
Congress leader on bandh

అసలే జనాలు లేరు అందునా ఉన్న వాళ్లు కూడా రాకపోతే ఎలా ఉంటుంది. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి పెద్ద తలకాయ్ అనుకున్న వ్యక్తే కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులే గుర్రుగా ఉన్నారు. చెప్పేవి సారంగనీతులు.. దూరేది దొమ్మరిగుడిసెలు అన్న చందంగా మాటలు మాత్రం చెప్పడానికి చాలా వచ్చిన నేతలకు చెయ్యడానికి మాత్రం కాళ్లు కదలవు. మాటలు కోటలు దాటినా కాళ్లు మాత్రం గడప దాటవు అన్న చందాన మన కాంగ్రెస్ పేద్ద మనిషికి బంద్ లో పాల్గొనే తీరిక లేకపోయింది. దాంతో బంద్ కు పిలుపునిచ్చిన వారిలో పెద్ద తలకాయనే కీలకం అనుకున్నాం.. కానీ ఇలా కనీసం పాల్గొనకపోవడం ఏంటా అని చర్చించుకుంటున్నారట.

తెలంగాణ రైతులకు మద్దతుగా, కేసీఆర్ సర్కార్ కు వ్యతిరేకంగా విపక్షాలు అన్నీ కలిసి పోరాటానికి సిద్దమయ్యాయి. అందులో భాగంగానే బంద్ కు పిలుపునిచ్చాయి. అయితే బంద్ లో అందరిని పాల్గొనాలని కోరారు. కానీ మీడియా ముందు మైక్ పట్టుకొని ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చిన ఓ బడా కాంగ్రెస్ నేత మాత్రం బంద్ లో పాల్గొనలేదు. బంద్ కు దూరంగా ఉన్నారు. ఆయన ఎవరు అని అనుకుంటున్నారా.? ఇంకెవరు తెలంగాణ కాంగ్రెస్ లో సీనియర్ జానారెడ్డి. అవును జానారెడ్డి బంద్ లో ఎక్కడా కనిపించలేదు. కానీ బంద్ సందర్భంగా అరెస్టయిన విపక్షాల సభ్యులకు మాత్రం తన మద్దతు ప్రకటించారు. అయినా ిలా బంద్ లో పాల్గొనకుండా.. బయట నుండి మాత్రమే మద్దతు ప్రకటిస్తే ఎలా అని అనుకునే వాళ్లు అనుకుంటున్నారు. కానీ జానారెడ్డి.. సీనియర్ నాయకుడు.. ఆయనకు మాత్రం ఇలాంటి చిన్న విషయాలు తెలియదా ఏంటి అని అనుకునే వాళ్లు కూడా ఉన్నారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Congress  janareddy  Bandh  Telangana bandh. Congress Janareddy  JanaReddy on Bandh  

Other Articles