Chandrababu reveal his health secret

Ap cm chandrababu naidu reveal his health secret

Chandrababu Naidu, AP, Egg, International Egg Day, Egg for energy, Egg for health

AP CM Chandrababu Naidu reveal his health secret. Chandra babu Naidu reveals his health secret, that he eats egg every day that is the secret of his energy.

ITEMVIDEOS: చంద్రబాబు హెల్త్ సీక్రెట్ తెలిసింది

Posted: 10/09/2015 11:24 AM IST
Ap cm chandrababu naidu reveal his health secret

ఏపి సిఎం నారా చంద్రబాబు నాయుడు.. ఎంతో మందికి ఆరోగ్యం విషయంలో ఆదర్శంగా ఉంటారు. ఆయన వయస్సు 65 అయినా కూడా పదహారు సంవత్సరాల కుర్రాడిలా దూకుడుగా ఉంటారు. ప్రతి అంశాన్ని చాలా షార్ప్ గా గమనిస్తారు. ఉరకలేసే ఉత్సాహం చంద్రబాబు నాయుడు సొంతం. ఆరు పదుల వయస్సు దాటినా కానీ అలపెరుగకుండా పాదయాత్ర చెయ్యగల సత్తా ఉన్న ఆరోగ్యవంతుడు. అయితే తాజాగా చంద్రబాబు నాయుడు తన ఆరోగ్యం అంత పదిలంగా ఎలా ఉంటుందో తెలిపే సీక్రెట్ రివీల్ చేశారు. తాను ఆరోగ్యంగా ఉండడానికి రోజు అది తింటా అని వెల్లడించారు ఏపి సిఎం నారా చంద్రబాబు నాయుడు. ఇంతకీ చంద్రబాబు రోజూ ఏం తింటారో తెలుసా..? ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఏం చేస్తారో తెలుసా.?

ఏపి సిఎం నారా చంద్రబాబు నాయుడు ఆరు పదుల వయస్సులో కూడా ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఉన్నారు. అనారోగ్యాన్ని దరి చేరనివ్వకుండా ఉండడానికి ఆయన ప్రతి రోజు ఉదయాన్నే ఒక గుడ్డు తింటారట. అవును ఆయన ప్రతి రోజు తీసుకునే గుడ్డు ఆరోగ్యాన్ని కాపాడుతోందని చంద్రబాబు వెల్లడించారు. ఇంటర్నేషనల్ ఎగ్ డే సందర్భంగా విజయవాడలో ఏర్పాటు  చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తన హెల్త్ సీక్రెట్ ను వెల్లడించారు. ప్రతి ఒక్కరు ఒక గుడ్డు ప్రతి రోజూ తినాలని.. ఆరోగ్యాన్ని పెంచుకోవాలని పిలుపునిచ్చారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chandrababu Naidu  AP  Egg  International Egg Day  Egg for energy  Egg for health  

Other Articles