Bahubali and kakakeya of ap

He is the ap state bahubali and kakakeya is other

Roja, Baahubali, bahubali, Jagan, Chandrababu Naidu, Jagan Protest, AP, Special Status, MLA Roja

He is the ap state Bahubali and kakakeya is other. YSRCP leader Roja dicribe the bahubali and kalakeya roles in the state of ap. She said that jagan is the Bahubali and chandraabu Naidu is the Kalakeya

ITEMVIDEOS: ఏపి బాహుబలి, కాలకేయ ఎవరంటే..

Posted: 10/09/2015 08:37 AM IST
He is the ap state bahubali and kakakeya is other

ఆమె... ప్రతి మాట తూటాల పేలుతుంది. ఎవరి మీద అయినా తనదైన స్టైల్లో మాట్లాడటంలో ఆమెకు, ఆమే సాటి. వైసీపీ పార్టీలో జగన్ తర్వాత అంత మీడియా పాపులారిటీ ఉన్న నేత ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా రోజా. నగరి ఎమ్మెల్యేగానే కాకుండా... సినిమా రంగం నుండి రావడంతో ముందు నుండి రోజాకు గుర్తింపు ఉంది. అయితే ఆ మధ్యన అసెంబ్లీ బయట నన్ను రేప్ చేసే దైర్యం ఉందా..? అని ప్రశ్నించిన రోజా మరోసారి తన మాటల తూటాలు పేల్చింది. అయితే రోజా సినిమా ఇండస్ట్రీ నుండి వచ్చింది కాబట్టి సినిమా స్టైల్లోనే జగన్ ను, చంద్రబాబును పోల్చింది. మొత్తానికి రోజా పోల్చిన విధానం మీద చర్చ సాగుతోంది.

బాహుబలి సినిమా తెలుగు ఇండస్ట్రీకి ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమా ఎంతో మంది మన్ననలు పొందింది. అయితే తాజాగా బాహుబలి సినిమాలో బాహుబలిగా జగన్ ను పోల్చింది. మరి జగన్ బాహుబలి అయితే చంద్రబాబు నాయుడు ఏమవుతారని అనుకుంటున్నారేమో దానికి కూడా క్లారిటీ ఇచ్చారు రోజా. ఏపి సిఎం చంద్రబాబు నాయుడు బాహుబలి సినిమాలో కాలకేయగా వర్ణించారు రోజా. ఏపిలో ప్రస్తుతం సాగుతున్న చంద్రబాబు నాయుడు పాలన.. బల్లాలదేవుడి పాలనలా ఉందంటూ మాటల తూటాలు పేల్చారు. మొత్తానికి రాజకీయానికి, సినిమాకు రోజా భలే లింక్ చేసింది. జగన్ బాహుబలిలో లేదంటే.. చంద్రబాబు నాయుడే బాహుబలినా అన్నది ప్రజలు నిర్ణయిస్తారు. అయినా రాజకీయ పైత్యం సినిమాలకు ఎందుకు అద్దుతున్నారని విమర్శించే వాళ్లు విమర్శిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Roja  Baahubali  bahubali  Jagan  Chandrababu Naidu  Jagan Protest  AP  Special Status  MLA Roja  

Other Articles