Telanagana Bandh on this saturday

Telanagana bandh on this saturday

telangana Bandh, Bandh, farmers, Suicide, Telangana Govt, KCR, TDP, Congress, BJP, Revanth Reddy, Uttam Kumar

Telangana opposition parties conform the Telangana Bandh on satur day. TDp , Congress, BJP and all other opposition parties call for bandh.

శనివారం నాడు తెలంగాణ బంద్

Posted: 10/08/2015 01:29 PM IST
Telanagana bandh on this saturday

తెలంగాణ రాష్ట్రంలో .జరుగుతున్న రైతుల ఆత్మహత్యల మీద ప్రతిపక్షాలు సమరశంఖం పూరించాయి. అన్ని విపక్షాలు ఏకమై ప్రభుత్వాన్ని వత్తిడి తీసుకువస్తున్నాయి. రైతులను అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ.. రైతులకు పంట నష్టపరిహారాన్ని ఏకకాలంలో చెల్లించాలని ముక్త కంథంతో పోరాడుతున్నాయి. అయితే మొన్నటి అసెంబ్లీ సమావేశాల నుండి అన్ని విపక్షాల నేతలను బహిష్కరిస్తూ అధికారపక్షం తీసుకున్న నిర్ణయాన్ని అన్ని విపక్షాలు ఖండిస్తున్నాయి. అందుకు నిరసనగా ఈ శనివారం తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చాయి. అయితే తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నుండి అన్ని విపక్షాల సభ్యులను సస్పెండ్ చేసినప్పుడే బంద్ మీద ఏదో ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పినా.. అన్ని పార్టీల నాయకులు మాట్లాడి చివరకు శనివారం రోజు బంద్ ను నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.

తెలుగుదేశం పార్టీ తెలంగాణ అధినేత ఎల్. రమణ ఇప్పటికే పదో తేదిన బంద్ నిర్వహిస్తున్నట్లు ప్రకటన చేశారు. కాగా కాంగ్రెస్ నాయకులు మాత్రం తొమ్మిదో తేదీ వరకు రైతుల రుణాలను మాఫీ చేస్తూ ప్రభుత్వం ప్రకటన చెయ్యాలని డిమాండ్ చేశారు. బిజెపి పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా పదో తేదీ బంద్ మీద స్పష్టతనిచ్చారు. కామ్రేడ్ పార్టీలు ఇప్పటికే బంద్ కు మద్దతు ప్రకటించిగా.. ఈ ఉదయం అన్ని పార్టీల నాయకులు కలిసి సమావేశం నిర్వహించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి, చింతల రామ్మోహన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు తదితరులు సమావేశమై బంద్ మీద ఉమ్మడి ప్రకటన చేశారు. అన్ని ప్రజా సంఘాలు కూడా బంద్ కు మద్దతునివ్వాలని కోరారు. ప్రజలు కూడా బంద్ కు తమ మద్దతునివ్వాలని నాయకులు కోరారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : telangana Bandh  Bandh  farmers  Suicide  Telangana Govt  KCR  TDP  Congress  BJP  Revanth Reddy  Uttam Kumar  

Other Articles