Chinas New Glass Bottom Bridge

Chinas glass bridge

China, China Glass-Bottom Bridge, China New Glass-Bottom Bridge, China Glass-Bottom Bridge, CracksChina Glass-Bottom Bridge, CrackYuntai Mountain, Henan Province

Suspended some 3,500 feet above sea level, a brand-new glass-bottom bridge clinging to China's Yuntai Mountain has left some tourists terrified. The U-shaped bridge spans across the mountain's face in Henan Province, giving tourists a chance to see the absence of ground between their feet and the sharp rocks below.

ITEMVIDEOS: దైర్యం ఉంటేనే ఆ బ్రిడ్జ్ ఎక్కాలి. లేదంటే

Posted: 10/08/2015 12:28 PM IST
Chinas glass bridge

చెట్టులెక్క గలవా ఓ నరహరి పుట్టలెక్కగలవా.. చెట్టులెక్కి చిటారు కొమ్మ చిగురు తేగలవా అని చిన్నప్పుడు సినిమాలో వచ్చిన పాట ఒకటి ఉంది. అయితే చెట్లెక్కే వాళ్లు చాలా మందే ఉన్నారు కానీ ఓ బ్రిడ్జ్ ఎక్కాలంటే మాత్రం చాలా మంది భయపడుతున్నారు. ఎందుకు అలా అంటే... అది ఎక్కాలంటే దైర్యం కావాలి. సరే చూద్దాం అనుకొని సాహసం చేసినా కొద్ది దూరం కూడా నడవకముందే ప్రాణాలు గాల్లో తేలడంతో వెనక్కి తిరిగిన వాళ్లు చాలా మంది ఉన్నారు. ఇంతకీ అలాంటి బ్రిడ్జి ఎక్కడ ఉంది అనుకుంటున్నారా...? చైనాలో కొత్తగా ఏర్పాటు చేశారు. చైనాలోని యుంటై మౌంటేన్ వద్ద ఈ బ్రిడ్జిని ఏర్సాటు చేశారు. ఎంతో మంది దీన్ని చూడడానికి వస్తున్నారు. కానీ చాలా మంది దాటకుండానే వెనక్కి తగ్గుతున్నారు. ఎందుకు అంతలా భయపడుతున్నారో తెలుసా..?

చైనాలోని యుంటై మౌంటేన్ వద్ద టూరిస్ట్ ల కోసం కొత్తగా ఎంతో ఖర్చుతో ఏర్పాటు చేసిన బ్రిడ్జ్ ఉంది.  దాని స్పెషాలిటి ఏంటీ అనుకుంటున్నారా.? బ్రిడ్జిని గాజుతో తయారు చేశారు. అవును జనరల్  గా  బ్రిడ్జ్ అంటే కాంక్రీట్ తో కడతారు.. కానీ అక్కడక్కడ అడవుల్లో అయితే కట్టెలతో బ్రిడ్జ్ లు ఏర్పాటు చేస్తారు కానీ అక్కడ మాత్రం గ్లాస్ తో బ్రిడ్జ్ ను ఏర్పాటు చేశారు. అది కూడా మామూలు ఎత్తులో కాదు భూమి నుండి 3500 ఫీట్ల ఎత్తులో కాలి కింద గాజు ఉంటే. కింద ఉండే లోయ కనిపిస్తుంటే ఎలా ఉంటుంది చెప్పండి. అచ్చంగా అలాంటి అనుభూతినే చైనాలో ఈ బ్రిడ్జ్ కల్పిస్తుంది. చాలా మంది టూరిస్ట్ లు ఈ బ్రిడ్జ్ ను దాటేందుకు ప్రయత్నించినా కొద్ది దూరం రాగానే దైర్యం సరిపోక వెనుదిరుగుతున్నారు. అయితే తాజాగా బ్రిడ్జ్ మొత్తం గ్లాస్ తో ఉండగా.. అక్కడక్కడా గ్లాస్ లో చిలికలు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. చాలా మంది పర్యాటకులు ఆ చీలకలు చూసి భయపడుతున్నారు. అధికారులు మాత్రం అవి ఏమీ కాదని అంటున్నారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles