Robbers Returns Without Taking Money From ATM For Not Coming Even Blast Them | Hyderabad ATM Machines Robbery Case

Hyderabad atm machines robbery case robbers returns without taking money

hyderabad robbery case, atm machines robbery case, atm machines robbery, atm machine robber, robbersy returns without taking money, robbers crime news, hyderabad atm machines

Hyderabad ATM Machines Robbery Case Robbers Returns Without Taking Money : Robbers Returns Without Taking Money From ATM For Not Coming Even Blast Them.

పండని దొంగల పంట.. ఏటీఎంలు బద్దలుకొట్టినా డబ్బులు రాలే!

Posted: 10/08/2015 11:30 AM IST
Hyderabad atm machines robbery case robbers returns without taking money

దొంగతనం చేద్దామని భావించిన కొందరు దొంగలు.. తమకు అనుకూలంగా వుండే ఓ ప్లాన్ వేసుకున్నారు. అనుకున్నట్లుగానే ఏటీఎం మిషన్ల దగ్గర ఎవరూ లేని సమయంలో చొరబడ్డారు. సాయశక్తులు ప్రయత్నించి ఏటీఎం మెషిన్లను ఓపెన్ చేసేందుకు ప్రయత్నించారు. కానీ.. అప్పుడు రాకపోవడంతో వాటిని ధ్వంసం చేశారు. అప్పటికీ.. డబ్బులు రాకపోవడంతో చేసేదేమీ లేక వచ్చినట్లే ఖాళీ చేతులతో వెనక్కి వెళ్లిపోయారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బుధవారం రాత్రి కొందరు దొంగలు హైదరాబాద్ శివారు ప్రాంతం వనస్థలిపురంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సౌత్ ఇండియన్ బ్యాంక్ ఏటీఎంలలోని నగదును ఎత్తుకేళ్లేందుకు వచ్చారు. అంతకుముందే ఆ ప్రాంతంలో రెక్కీ నిర్వహించిన దొంగలు తమకు అనుకూలమైన సమయంలోనే చోరీ కోసం వచ్చారు. అనుకున్నట్లుగానే వారు వచ్చే సమయానికి అక్కడ ఒక్కరు కూడా లేరు. దీంతో ఏటీఎంలలోకి దొంగలు చొరబడ్డారు. తమవెంట తెచ్చుకున్న సరంజామాతో ఏటీఎం మిషన్లను తెరిచేందుకు యత్నించారు. అయితే వారి పన్నాగం పారలేదు. ఎంత యత్నించినా ఏటీఎం మిషన్లు తెరచుకోలేదు. దీంతో చిర్రెత్తుకొచ్చిన దొంగలు.. ఏటీఎం మిషన్లను ద్వంసం చేసైనా నగదు ఎత్తుకెళ్లాలని చూశారు. దీంతో ఏటీఎంలను ధ్వంసం చేశారు. ఈ క్రమంలో వారి దాడిలో ఏటీఎం మిషన్లు ధ్వంసమైతే అయ్యాయి కానీ, అవి మాత్రం తెరచుకోలేదు. ఇక లాభం లేదనుకున్న దొంగలు అక్కడి నుంచి ఖాళీ చేతులతోనే వెళ్లిపోయారు.

మరోవైపు.. ఈ చోరీ యత్నంపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాల ఆధారంగా దొంగలను గుర్తించే పనిలో పడ్డారు. స్థానికంగా వుండే కొందరు దుండగులే ఈ దొంగతనానికి పాల్పడి వుంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : hyderabad robbery case  atm machines robbery  

Other Articles