The Airport Authorities Of Peru Discovered A Man Inside A Luggage Bag With The Help Of Sniffer Dog | Sniffer Dogs Jobs

Airport authorities discover a man inside a luggage bag with sniffer dog help in peru

Man in Bag, Sniffer Dog Found Man In Bag, Peru Airport Incident, man found in bag peru incident, dog found man inside bag in peru, airport authorities found man inside bag

Airport Authorities Discover A Man Inside A Luggage Bag With Sniffer Dog Help : Man is caught trying to smuggle himself out of Peru in a suitcase after sniffer dog smells him.

ITEMVIDEOS: డామిట్.. కుక్క వల్ల కథ మొత్తం అడ్డం తిరిగింది!

Posted: 10/06/2015 06:46 PM IST
Airport authorities discover a man inside a luggage bag with sniffer dog help in peru

ఇద్దరూ స్నేహితులు చాలాకాలం నిరీక్షించిన అనంతరం ఎంతో చాకచక్యంగా ఆలోచించి వేసుకున్న ఓ పన్నాగాన్ని ఒక కుక్క బట్టబయలు చేసేసింది. వారిరువురు తమ పథకం ప్రకారమే ముందుకు దూసుకెళ్తుంటే.. వెనక నుంచి ఈ కుక్క తన పని చేసుకుంటూ వచ్చింది. అంతే! వీరి ప్లాన్ బయటపడటంతో అడ్డంగా బుక్కయ్యారు. వారి ప్లాన్ విన్న పోలీసులు ఒక్కసారిగా విస్తుపోయారు. ఇంతకీ.. వారిద్దరు వేసిన పన్నాగం ఏంటి? వారికి, కుక్కకి సంబంధం ఏంటి? ఆ కుక్క ఆ స్నేహితుల ప్లాన్ ని ఎలా బహిర్గతం చేసింది? అని అనుకుంటున్నారా! ఆ వివరాలు తెలియాలంటే మేటర్ లోకి వెళ్లాల్సిందే!

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పెరూ రాజధాని లీమాలోని జార్జ్ ఛావెజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. ఆ సమయంలో వారి దగ్గరున్న స్నిఫర్ డాగ్ ఓ ప్రయాణికుడి లగేజ్ వెంటబడింది. సదరు ప్రయాణికుడు ఆ కుక్క నుంచి ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేకపోయంది. అంతే! అంతటితో కథ ఒక్కసారిగా అడ్డం తిరిగింది. కుక్క వెంటపడడంతో అనుమానించిన పోలీసులు.. వెంటనే లగేజ్ ఓపెన్ చేయాలని అతడ్ని అధికారులు కోరారు. తొలుత సూట్ కేసు తెరిచేందుకు సదరు ప్రయాణికుడు నిరాకరించినా, అధికారుల ఒత్తిడితో తెరవక తప్పలేదు. అతగాడు సూట్ కేసు ఓపెన్ చేయగానే.. అందులోంచి ఓ వ్యక్తి నెమ్మదిగా లేచి నిలబడ్డాడు. దీంతో విమానాశ్రయ భద్రతాధికారులతోపాటు చుట్టుపక్కల వున్న ప్రయాణికులందరూ ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. సూట్ కేసు నుంచి మనిషి బయటికి రావడమేంటని అవాక్కయ్యారు.

భద్రతాధికారులు వారిద్దరినీ అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించారు. అప్పుడు వారిద్దరూ తమ కథని వినిపంచారు. తామిద్దరం చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులమని, దేశం దాటి వెళ్లిపోదామని నిర్ణయించుకున్నామని చెప్పారు. అయితే ఒకరి దగ్గరే పాస్ పోర్టు, వీసా ఉండడంతో రెండో వ్యక్తి వెళ్లడానికి మరో మార్గం కనపడలేదని.. అందుకే సూట్ కేసులో దాక్కుని దేశం విడిచి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నట్టు విచారణలో వెల్లడించారని అధికారులు తెలిపారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sniffer Dog Found Man In Bag  Peru Airport Incident  

Other Articles