Alag Alag' Says Lalu Prasad in Bihar

Lalu about rahul gandhi

lalu prasad, Bihar, Elections, Nitesh Kumar, BJP, Sonia Gandhi, Rahul Gandhi, Congress

Lalu Prasad Yadav, who had skipped Rahul Gandhi's first election rally in Bihar last month, today said that he will not be campaigning alongside his mother and Congress President Sonia Gandhi for the Bihar elections, to be held in five phases from October 12. "We will be campaigning alag, alag (separately)," said Mr Yadav when asked if he would campaign with Mrs Gandhi. Their parties are allies in an anti-BJP coalition being led by Bihar Chief Minister Nitish Kumar.

దానికి పై.. కానీ రాహుల్ గాంధీ నై

Posted: 10/05/2015 01:01 PM IST
Lalu about rahul gandhi

బీహార్ లో ఎన్నికల వాతావరణం రోజురోజుకు అక్కడి పరిస్థితులను మార్చేస్తోంది. అక్కడి పొత్తులు, ఎత్తులు రాజకీయ విశ్లేషకులకు సైతం విస్తు కలిగిస్తోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా మారిన బీహార్ ఎన్నికల సమరంలో అందరూ అస్ర్తశస్త్రాలతో యుద్దానికి సిద్దపడ్డావాళ్లే. తాజాగా అక్కడి ఎన్నికల ప్రచారంలో అందరూ బిజీగా మారారు. బిజెపి పార్టీ బీహార్ ఎన్నికలను ఎంతో కీలకంగా భావిసస్తోంది. బీహార్ లో నితీష్ కుమార్ కు ఎలాగైనా సరే అధికారాన్ని దూరం చెయ్యాలని చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి. అయితే లాలూ ప్రసాద్  కూడా చాలా స్ట్రాటెజిక్ గా వ్యవహారిస్తున్నారు. రాజకీయ పరిణామాలను బేరీజు వేస్తూనే తన చరిష్మాను కూడా కాపాడుకుంటున్నారు. బీహార్ వ్యాప్తంగా నిర్వహిస్తున్న వివిధ ర్యాలీలు, సభల్లో పాల్గొంటున్న లాలూ ప్రసాద్ తాజాగా రాహుల్ గాంధీ మీద చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ మీద లాలూ ప్రసాద్ రాజకీయ ఎత్తుగడ అని చాలా మంది చర్చించుకుంటున్నారు.

బీహార్ ఎన్నికల ర్యాలీలో నితీష్ కుమార్ లాలూ ప్రసాద్ యాదవ్, సోనియా గాంధీతో కలిసి పాలుపంచుకున్నారు. అంతకంతకు రంజుగా మారిన ఎన్నికల నేపథ్యంలో బీహార్ లో ఎవరు ఏం మాట్లాడినా అది ఖచ్చితంగా హా్ట్ టాపిక్  గా మారుతోంది. తాజాగా సోనియా గాంధీతో కలిసి లాలూ ప్రసాద్  పాల్గొన్న ర్యాలీలో రాహుల్ గాంధీ ప్రస్తావన వచ్చింది. అందులో భాగంగా రాహుల్ గాంధీతో తాను కలిసి ఎన్నికల ర్యాలీలు నిర్వహించలేనని. అలగ్ అలగ్ అని అన్నారు. రాహుల్ గాంధీతో కలిసి ప్రచారం చెయ్యలేను కానీ ఎన్నికల్లో మాత్రం మైత్రి కొనసాగుతుందని అన్నారు. మొత్తంగా లాలూ ప్రసాద్ కూడా తన సంప్రదాయ ఓటు బ్యాంకును కాపాడుకుంటూనే ఎన్నికల్లో నెగ్గుకురావాలని చూస్తున్నారు. రాజకీయం అంటు ఇదే మరి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : lalu prasad  Bihar  Elections  Nitesh Kumar  BJP  Sonia Gandhi  Rahul Gandhi  Congress  

Other Articles