Muslim father strangled daughter,to death in 'honour killing'

Daughter killed by father for stealing condoms

Muslim,father,strangled,daughter,19,death,honour,killing,caught,stealing,condoms,sex,forbidden,boyfriend,Germany, condom, sex, Boyfriend, Germany, father kills daughter, Mulsim father, Lareeb, molestation, violence against women, crime against women, attrocity at women, harrassment on women, rape, gang rape, molestation against women

Asadullah Khan and his wife Shazia, originally from Pakistan, are on trial for the murder of their daughter Lareeb at the State Court in Darmstadt.

కండోమ్స్ దొంగలించినందుకు కూతుర్ని హత్య చేసిన కసాయి..

Posted: 09/29/2015 10:07 PM IST
Daughter killed by father for stealing condoms

తన కుమార్తె కండోమ్స్ దొంగిలించిందని పోలీసుల నుంచి లేఖ రావడంతో ఆమెను గొంతు పిసికి చంపేశాడు ఒక తండ్రి. ఈ ఏడాది జనవరి 28న జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు కోర్టు విచారణలో బయటపడ్డాయి. పాకిస్తాన్ నుంచి వచ్చి జర్మనీలో స్థిరపడిన అసదుల్లా ఖాన్ (51), ఆయన భార్య షాజియా (41) ప్రస్తుతం ఈ కేసులో విచారణను ఎదుర్కుంటున్నారు. డర్మ్ స్టాట్‌లో జరిగిన ఈ సంఘటనలో పలు వివరాలు వెలుగులోకి వచ్చాయి.
 
కుమార్తె లరీబ్ (19)ని భర్త బారి నుంచి కాపాడేందుకు ప్రయత్నించి విఫలమయ్యానని షాజియా కోర్టుకు చెప్పగా, వీరి రెండో కుమార్తె నాడియా తన తల్లికి వ్యతిరేకంగా సాక్ష్యమిచ్చింది. ఇంట్లో తన తల్లి షాజియాదే పైచేయి అని, ఆమె తల్చుకుంటే తన అక్కను కాపాడేదని నాడియా తెలిపింది. పైగా తల్లి తనను కూడా కర్రతో బాదుతుండేదని న్యాయమూర్తికి చెప్పింది. అంతేగాక, అక్క లరీబ్‌కు పాకిస్తాన్‌లోనే బలవంతంగా వివాహం చెయ్యాలని తండ్రి భావిస్తుండేవాడంది.
 
విచారణలో తల్లి షాజియా తన వాదన వినిపిస్తూ తమ కూతురు లరీబ్ ఎన్నో రాత్రుల పాటు ఇంటికి రాలేదని, బురఖా ధరించేది కాదని చెప్పింది. లరీబ్ ఒక దుకాణంలో కండోమ్స్ దొంగిలించినట్లు పోలీసుల నుంచి లేఖ రావడంతో ఆమెకు మరో అబ్బాయితో లైంగిక సంబంధాలున్నట్టు స్పష్టమైందని, ఆ లేఖను తన భర్తకు చూపించడంతో కుమార్తెను కొట్టాడని తెలిపింది. లరీబ్ బాయ్ ఫ్రెండ్ రహీల్ స్పందిస్తూ ఇంట్లో ఆమె ఎప్పుడూ వేధింపులకు గురవుతుండేదని పేర్కొన్నాడు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : condom  sex  Boyfriend  Germany  father kills daughter  Mulsim father  Lareeb  

Other Articles