Central Government Approve For Amaravathi Ringroad Around 185 Kilometers | Ap Capital City | Chandrababu Naidu

Central government approve amaravathi ringroad ap capital city

ap capital city, andhra pradesh govt, amaravathi master plan, amaravathi ring road plan, amaravathi plan, amaravathi latest updates, central government, chandrababu naidu

Central Government Approve Amaravathi Ringroad Ap Capital City : Central Government Approve For Amaravathi Ringroad Around 185 Kilometers.

‘అమరావతి’ చుట్టూ రింగ్ రోడ్డుకు కేంద్రం ఆమోదం

Posted: 09/28/2015 03:56 PM IST
Central government approve amaravathi ringroad ap capital city

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంతో ప్రతిష్టాత్మకమైన రాజధాని ‘అమరావతి’ నిర్మాణానికి సంబంధించిన కార్యక్రమాలు వేగవంతంగా దూసుకుపోతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే ఈ నూతన రాజధాని నిర్మాణం ఊపందుకోవడం కోసం ఆ ప్రాంతంలో సర్కారు కార్యాలయాలు, వాణిజ్య అవసరాల కోసం 20 ఎకరాల్లో అమరావతి టౌన్‌షిప్ నిర్మాణం చేపట్టాలని సీఆర్డీఏ నిర్ణయించింది. అలాగే.. ప్రకాశం బ్యారేజీకి ఎగువన కృష్ణానదిపై అత్యాధునిక టెక్నాలజీతో రెండు ఐకాన్ బ్రిడ్జెస్ (వంతెనలు) నిర్మించేందుకు ఆ సంస్థ యోచిస్తోంది. ఇలా అమరావతి నిర్మాణంలో భాగంగా పనులు వేగవంతంగా జరుగుతుండగానే.. తాజాగా కేంద్రం అమరావతి చుట్టూ 185 కిలోమీటర్ల మేర రింగ్ రోడ్డు వేసేందుకు ఆమోదం తెలిపింది. దీంతోపాటు ఆంధప్రదేశ్ రాష్ట్రంలో 800 కిలోమీటర్ల రోడ్లను జాతీయ రహదారులుగా మార్చనున్నట్లు కేంద్రం తెలిపింది. ఈ ప్రాజెక్టు కోసం వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించనున్నారు.

కర్నూలు మీదుగా అనంతపురం, అమరావతిని కలుపుతూ ఎన్హెచ్ 44, ఎన్హెచ్ 65తో అనుసంధానించేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. అలాగే కర్నూలు, కడప, అనంతపురాలను కలుపుతూ ఎన్హెచ్ 40, ఎన్హెచ్ 60లను అనుసంధానించనున్నారు. ప్రస్తుతం నాలుగు లేన్లుగా ఉన్న రహదారులను 6, 8 లేన్ల జాతీయ రహదారులుగా మారుస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూసేకరణ ప్రక్రియను పూర్తిచేస్తే పనులు వెంటనే ప్రారంభిస్తామని కేంద్రం తెలిపింది. ఇదిలావుండగా.. రాష్ట్రాభివృద్ధి కోసం చంద్రబాబు తీవ్రంగా శ్రమిస్తున్న విషయం తెలిసిందే! ముఖ్యంగా రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చేందుకు ఆయన ఎంతో శ్రమిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన అమరావతి నిర్మాణాన్ని ఆయా దేశ పారిశ్రామిక వేత్తలకు చూపిస్తూ.. పెట్టుబడులు పెట్టేందుకు తమ రాష్ట్రం, రాజధాని ప్రాంతాలు అనువుగా వుంటాయని పేర్కొంటున్నారు. దీంతో కొన్ని పారిశ్రామిక సంస్థలు అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. అమరావతి నిర్మాణ పనులు దసరా నుంచి ప్రారంభం కానున్న సంగతి విదితమే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : amaravathi master plan  chandrababu naidu  amaravathi ring road  

Other Articles