A Husband Named Rajeev Sharma Brutally Killed His Wife For Not Satisfying His Wish | Uttar Pradesh Crime News

Husband rajeev sharma brutally killed his wife uttar pradesh bareli crime news

husband killed wife, husband brutally beat wife, husband wife fight, man killed wife, rajeev sharma killed wife, uttar pradesh crime news, nirbhaya incident, nirbhaya cases

Husband Rajeev Sharma Brutally Killed His Wife Uttar Pradesh Bareli Crime News : A Husband Named Rajeev Sharma Brutally Killed His Wife For Not Satisfying His Wish.

భార్య కోరిక తీర్చలేదని.. పాశవికంగా హతమార్చిన భర్త

Posted: 09/28/2015 01:37 PM IST
Husband rajeev sharma brutally killed his wife uttar pradesh bareli crime news

భార్య తన కోరిక తీర్చలేదన్న కోపంతో ఓ తాగుబోతు ఆమెను అత్యంత దారుణంగా హింసించాడు. ఆ హింసను తట్టుకోలేకపోయిన ఆమె చివరికి అక్కడికక్కడే ప్రాణాలు వదిలేసింది. రక్తపు మడుగులో పడి ఉన్న ఆమె మృతదేహం పక్కనే కూర్చొని లోపల గడియ వేసుకున్నాడు. ఈ దారుణమైన ఘటన ఉత్తరప్రదేశ్ లోకి బరేలిలో చోటు చేసుకుంది. బాధితురాలి ఇంటికి సమీపంలోనే వుండే సోదరి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది.

పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. బరేలిలోని నారియావాల్ జిల్లాకు చెందిన రాజీవ్ శర్మకు ఓ మహిళతో వివాహం జరిగింది. కొన్నాళ్లు వీరి వైవాహిక జీవితం సంతోషంగానే సాగింది. వీరికి ఓ కొడుకు కూడా జన్మించాడు. అయితే.. గతకొన్నాళ్ల నుంచి రాజీవ్ తాగుడుకు బానిసయ్యాడు. ప్రతిరోజూ తాగి తన భార్యతో గొడవకు దిగేవాడు. అయినప్పటికీ ఆమె ఎంతో ఓర్పుతో వుంటూ, అతనితో జీవనం కొనసాగించింది. కానీ.. అతని ఆగడాలు రోజురోజుకు పెరుగుతూనే వచ్చాయి. ఈ నేపథ్యంలో రాజీవ్ విపరీతంగా మద్యం తాగి తన భార్యతో గొడవకు దిగాడు. తన కోరికను తీర్చాల్సిందేనని మొండికేశాడు. అయితే ఆమె అతని కోరికను తిరస్కరించింది. అంతే.. కోపోద్రిక్తుడైన రాజీవ్ ఆమెపై దాడికి దిగాడు. ఢిల్లీ నిర్భయ ఉదంతం తరహాలో ఆమెపై లైంగికంగా దారుణమైన దాడి చేశాడు. ప్రాణాలు పోయేదాకా వదిలి పెట్టలేదు. బాధితురాలి శరీరంపై గాయాలు లేవు గానీ, విపరీతమైన రక్తస్రావంతోనే కన్నుమూసిందని పోలీసు అధికారి సంతోష్ కుమార్ తెలిపారు.

రాజీవ్ శర్మపై కేసు నమోదు చేసి స్టేషన్ కి తీసుకెళ్లారు. కోర్టు అతనికి 14 రోజుల రిమాండ్ విధించినట్టు తెలిపారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. భార్యను హత్య చేయడానికి ముందుకు ఆరుగంటల నుంచి మద్యం తాగినట్టు నిందితుడు అంగీకరించాడని పోలీస్ అధికారి రజ్బీర్ సింగ్ తెలిపారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : husband killed wife  nirbhaya incident  rajeev sharma  

Other Articles