Injection Psycho Hulchul in Bhagyanagar Express

Injection psycho caught in bhagyanagar express train

injection psycho arrested in hyderabad, injection psygho in bhagyanagar express, needle psycho manhandled by public in train, Bhagyanagar Express, Injection Psycho, Psycho, Psycho Arrested, Hyderabad, Bhagyanagar Express, cctv footage, psycho picture found, injection psycho found in cctv footage, andhrapradesh, injection, psycho

injection psycho Who challanged AP and Telangana Police and made people of two telugu states people to spent sleepless nights was caught by bhagyanagar express passengers and handovered to police

ITEMVIDEOS: భాగ్యనగర్ ఎక్స్ ప్రెస్ లో సైకో సూదిగాడి కలకం..చిత్తకోట్టి పోలీసులకు అప్పగింత

Posted: 09/26/2015 04:19 PM IST
Injection psycho caught in bhagyanagar express train

ఉభయగోదావరి జిల్లాల పోలీసులు, ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేసిన ఇంజక్షన్ సైకోలు ఎంతమంది అన్న వివరాలు తెలియక పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు. అటు ఉబయ గోదావరి జిల్లాలతో పాటు ఇటు.. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్, వరంగల్ జిల్లాలోనూ సూదిగాడు హల్ చల్ చేస్తున్నాడు. దీంతో ఇంతకీ ఈ సైకో సూదిగాళ్లు ఎంత మందని తెలియక పోలీసులు మళ్లీ తమ సిబ్బందికి అలర్ట్ చేశారు. ఆ మధ్య భీమవరంలో సిసిటీవీ ఫూటేజ్ లో సైకో సూదిగాడి ఫోటో దొరికింది

ఆ మరుసటి రోజున ఈ నెల 13న హైదరాబాద్ ఇందిరానగర్లోని ఓ హోటల్ సమీపంలో సూదీతో ఓ చిన్నారిపై దాడి చేసేందుకు యత్నించిన సైకోను స్థానికులు పట్టుకున్నారు. సైకోకు స్థానికులు దేహశుద్ధి చేసి... పోలీసులకు అప్పగించారు. కాగా నిన్న రాత్రి కూడా నెల్లూరు జిల్లాలో సైకో సూదిగాడు హల్ చల్ చేశారు. ఆరేళ్ల బాలికను సూదితో గుచ్చి పరారయ్యాడు. దీంతో బాధితురాలిని తక్షణం స్థానిక అసుపత్రికి తరలించిన తల్లిదండ్రులు అమెకు చికిత్స చేయిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేను నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఈ తరువాత తాజాగా ఇన్నాళ్లకు తాజాగా భాగ్యనగర్ ఎక్స్ ప్రెస్ రైల్లోకి ఎక్కిన సైకో ‘సూదిగాడు’ కలకలం రేపాడు. వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ లో రైలెక్కిన సూదిగాడు పలువురు ప్రయాణికులపై సిరింజీ దాడులు చేశాడు. దీంతో భీతిల్లిన ప్రయాణికులు హాహాకారాలు చేశారు. ఆ తర్వాత కొందరు ప్రయాణికులు కాస్తంత ధైర్యం చేసి సూదిగాడిని ఒడిసిపట్టేసి చితకబాదారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. అదుపులోకి తీసుకున్న సైకో నుంచి పోలీసులు పెద్ద సంఖ్యలో సిరంజీలు, సూది మందును స్వాధీనం చేసుకున్నారు.  

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : injection psycho  arrest  hyderabad police  bhagyanagar express  

Other Articles