More Women Accuse Saudi Prince Majed Abdulaziz Al-Saud After His Arrest on Sexual Harassment | Crime News

Saudi prince majed abdulaziz al saud sexual harassment case women accuse lapd

saud prince crime news, saude prince women accused, saudi prince Majed Abdulaziz Al-Saud, Majed Abdulaziz Al-Saud crime news, saudi prince crimes, women harassment case, sexual harassment cases

Saudi Prince Majed Abdulaziz Al-Saud Sexual Harassment Case Women Accuse LAPD : A Saudi prince Majed Abdulaziz Al-Saud who allegedly tried to force a female worker to perform a sex act on him inside a Beverly Glen residence has now been accused of attacking other women in the home, according to Los Angeles police and court records.

మహిళల జీవితాలతో చెలగాటమాడుతున్న యువరాజు

Posted: 09/26/2015 10:46 AM IST
Saudi prince majed abdulaziz al saud sexual harassment case women accuse lapd

అతనో యువరాజు.. దర్జాగా బ్రతికేందుకు ఆస్తులు, అంతస్తులు వున్నాయి. నలుగురిలో వున్నప్పుడు మర్యాదపూర్వకంగా నడుచుకునేలా నటిస్తాడు. కానీ.. తెరవెనుక మాత్రం చేసేవన్నీ దారుణాలే! మహిళలంటే చిన్నచూపు చూసే ఆ యువరాజు దాష్టీకాలు ఇన్నాళ్లూ నాలుగు గోడల మధ్యే వుండేవి. కానీ.. అతని చేతిలో ఎన్నో కష్టాలు అనుభవించిన మహిళ ముందుకు రావడంతో అతగాడి బాగోతం మొత్తం బయటపడింది. ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఎంతోమంది మహిళలు అతని చేతిలో బలైనట్టు పోలీస్ గుమ్మమెక్కి బోరుమంటున్నారు. ఇంతకీ ఆ యువరాజు ఎవరని అనుకుంటున్నారా! ఆ వివరాలు తెలియాలంటే మేటర్ లోకి వెళ్లాల్సిందే!

అతడి పేరు మజీద్ అబ్దులజీజ్ అల్ సౌద్.. సౌదీ యువరాజుగా వెలుగొందుతున్న ఈ 28 ఏళ్ల అజీజ్.. అమెరికాలో మాత్రం రాజ్యభోగాలు అనుభవిస్తూనే మహిళలకు నరకం చూపుతున్నాడు. లాస్ ఏంజెలిస్ లోని బెవర్లీ హిల్స్ లో నివాసముంటున్న ఈ యువరాజు ఎన్నాళ్ల నుంచో మహిళల్ని లైంగికంగా వేధిస్తున్నాడో తెలీదు కానీ.. తాజాగా ఓ మహిళ కారణంగా ఇతని వ్యవహారం మొత్తం బయటపడింది. ఇతను నివాసముంటున్న భవనం గోడ ఎక్కి పారిపోయేందుకు సదరు మహిళ ప్రయత్నించగా.. ఆమె కింద పడి గాయపడింది. తీవ్రంగా రక్తస్రావం అయిన ఆ మహిళ తిరిగి లేచి పరుగులు తీసేందుకు యత్నించింది కానీ వీలు పడలేదు. దీంతో ఆమె తనను రక్షించాలంటూ అరవడంతో.. అటువైపుగా వస్తున్న కొందరు ఆమెను రక్షించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఆ యువరాజును ‘ఓ మహిళను లైంగికంగా వేధించిన నేరానికి’ అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని లాస్ ఏంజెలిస్ పోలీసుశాఖకు చెందిన డ్రేక్ మాడిసన్ నిర్ధారించారు. దీంతో ఆ యువరాజుకు ఒక రోజు రాత్రంతా జైల్లోనే గడపాల్సి వచ్చింది. అయితే.. 2 కోట్ల రూపాయల పూచీకత్తు సమర్పించిన అనంతరం అతనిని వదిలిపెట్టారు. ఈ కేసులో భాగంగా ఆ యువరాజుకు అక్టోబర్ 19న కోర్టులో హాజరు కావాల్సి వుంది.

ఒకవేళ ఆ యువరాజు చేసిన నేరం రుజువైతే.. 8 ఏళ్ల జైలుశిక్ష పడడంతోపాటు 6.61 లక్షల రూపాయల జరిమానం చెల్లించాల్సి వుంటుంది. మరి.. ఇతగాడి భవిష్యత్తు ఏ దిశగా ప్రయత్నిస్తుందో వేచి చూడాల్సిందే! ఇదిలావుండగా.. ఈ యువరాజు అరెస్టుతో మరింతమంది మహిళలు.. అతడి చేతుల్లో బలయ్యామంటూ పోలీసుల ముందుకు వస్తున్నారని సమాచారం. ఆ యువరాజు తమని నిత్యం చిత్రహింసలకు గురయ్యాయని, అతగాడి వేధింపులు తాళలేక పారిపోయామని ఆమ ఆవేదన వ్యక్తం చేసినట్లు వార్తలొస్తున్నాయి.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Saudi Prince  Majed Abdulaziz Al-Saud  Women Harassment  

Other Articles