Traffic police overaction on roadside vendors

Traffic police overaction on roadside vendors

Traffic police, Vendors, Hyderabad, Traffic police Van, Uppal

Traffic police overaction on roadside vendors. Cyberabad traffic police over action on vendors, who selling some articles. In Uppal traffic police took veg basket into their van.

ITEMVIDEOS: ట్రాఫిక్ పోలీసుల ఓవర్ యాక్షన్

Posted: 09/23/2015 04:17 PM IST
Traffic police overaction on roadside vendors

ట్రాఫిక్ పోలీసుల గురించి ప్రత్యేకంగా ఎవరికీ పరిచయం అక్కర్లేదు. వెహికల్ ఉన్న ప్రతి ఒక్కరికి వారు ఎలా ప్రవర్తిస్తారో అందరికి తెలుసు. అయితే హైదరాబాద్ జంట నగరాల్లో ఖాకీలకు మరింత కావరం వచ్చింది. ట్రాఫిక్ డ్యుటీ ఎంత సిన్సియర్ గా చేస్తారో కూడా ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే తాజాగా ఓ వీడియో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల మీద విమర్శలు గుప్పించేలా చేసింది. అయితే ఇది మామూలుగా కాదు.. ఏకంగా జాతీయ వీడియాలో కూడా మన ట్రాఫిక్ పోలీసుల వైఖరి మీద కథనం రావడం చర్చనీయాంశంగా మారింది. ఫ్రెండ్లీ పోలీస్ అంటూ తెలంగాణ ప్రభుతకవం ఎంతలా ప్రయత్నాలు చేస్తున్నా అవి సఫలీకృతం అయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. ఉప్పల్ లో జరిగిన తాజా ఘటన చూస్తే మీరు కూడా వాళ్ల మీద విమర్శలు చెయ్యకుండా ఉండలేరు.

హైదరాబాద్ శివారు ప్రాంతమైన ఉప్పల్ లో అక్కడి చుట్టుపక్కలి ప్రాంతాల నుండి చాలా మంది చిన్న రైతులు రోడ్ల పక్కన పండ్లు, కూరగాయలు అమ్ముతుంటారు. చిరు వ్యాపారం చేసే వాళ్లు, సన్న రైతులు రోడ్డు పక్కన వస్తువులను అమ్ముతూ పొట్టపోసుకుంటారు. అయితే ఇలా రోడ్డు పక్కన వ్యాపారం చేసే వారి మీద ట్రాఫిక్ పోలీసులు కఠినంగా వ్యవహరించారు. ట్రాఫిక్ వాహనంలో అక్కడ అమ్ముతున్న కూరగాయలు లాక్కెళ్లడం కెమెరాలో రికార్డైంది. పోలీసులు తమ కూరగాయలను తీసుకెళుతున్నప్పుడు ఆ రైతు ఆపేందుకు ప్రయత్నించడం కూడా కెమెరాలో రికార్డైంది. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ట్రాఫిక్ పోలీసులు అతిగా చేస్తున్నారని... ఫలితంగా ఎంతో మంది నష్టపోతున్నారని మండిపడుతున్నారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Traffic police  Vendors  Hyderabad  Traffic police Van  Uppal  

Other Articles