governor narasimhan visited idh colony in hyderabad

Governor narasimhan praises telangana government double bedroom flats

governor visits IDH colony, governer narsimhan visjts double bedroom flats, telangana government double bedroom flats, governor praises double bedroom flats, double bedroom flats are equalent to ias quarters in delhi, quality construction of double bed room flats, IDH colony, nayini narsimhareddy, talasani, padmarao, Indrakaranreddy

governor narasimhan visited idh colony in hyderabada and praised telangana government for quality construction of double bedroom flats.

ఢిల్లీ ఐఎఎస్ అధికారుల క్వార్టర్ల కన్నా ఇవి చాలా బాగున్నాయి..

Posted: 09/22/2015 08:18 PM IST
Governor narasimhan praises telangana government double bedroom flats

పేదల కోసం తెలంగాణ ప్రభుత్వం కట్టిస్తోన్న డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణం బాగున్నాయంటూ రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈ ఎస్ ఎల్ నరసింహాన్ కొనియాడారు. మంగళవారం మధ్యాహ్నం బోయగూడలోని ఐడీహెచ్ కాలనీలో పేదల కోసం నిర్మిస్తున్న ఇళ్లను గవర్నర్‌ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా గవర్నర్ నరసింహాన్ మాట్లాడుతూ ఐడీహెచ్‌ కాలనీ గురించి సీఎం కేసీఆర్‌ తనకు వివరించారని అందుకే తాను చూసేందుకు వచ్చినట్లు చెప్పారు.

దేశ రాజధాని ఢిల్లీలో ఐఏఎస్ ఆధికారులకు కేటాయించే డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కంటే ఇవి చాలా బాగున్నాయని ప్రశంసించారు. ఐడీహెచ్ కాలనీలో జీహెచ్‌ఎంసీ అధికారులు పెత్తనం చేయరాదని, పర్యవేక్షణ మాత్రమే చేయాలని గవర్నర్ నరసింహన్ సూచించారు. ఎనిమిది నెలల తర్వాత మరోసారి ఐడీహెచ్ కాలనీని పరిశీలిస్తానని గవర్నర్ తెలిపారు. గవర్నర్‌తో పాటు తెలంగాణ మంత్రులు నాయిని నర్శింహారెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, పద్మారావు తదితరులు ఉన్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : governor  narasimhan  IDH colony  nayini narsimhareddy  talasani  padmarao  Indrakaranreddy  

Other Articles