AP Health Minister very disappointed on his department

Minister kamineni very disappointed

Chandrababu, Kamineni Srinivas, Health MInister, Health Department, AP, Guntur

AP Health Minister very disappointed on his department. Kamineni Srinivas is very nervous about his department working. Chandrababu naidu didnt interfear into this department.

నా శాఖ ఏం బాగోలేదంటున్నఏపి మంత్రి

Posted: 09/22/2015 04:38 PM IST
Minister kamineni very disappointed

ఏపి ముఖ్యమంత్రిగారు నారా చంద్రబాబు నాయుడు అంటే ఎంట స్ట్రిక్ట్ గా ఉంటారో అందరికి తెలుసు. అధికారులైనా, మంత్రులైనా కానీ తప్పు చేస్తే మాత్రం అస్సలు ఊరుకోరు. కానీ మంత్రి వర్గంలోని ఓ మంత్రికి మాత్రం ఇది వర్తించదు. ఆ మంత్రి గారు ఏం చేసినా కానీ చంద్రబాబు చూసీ చూడనట్లు వదిలేస్తారు. లోగుట్టు పెరుపాళ్ కెరుక కానీ.. ఆ మంత్రి గారిని మాత్రం పల్లెత్తి మాట అనరు. ఎందుకంటే అది మాత్రం తెలియదు. ఆ మంత్రి గారు ఎవరో కాదు వైద్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్. అయ్యగారి మీద ఎన్ని సార్లు విమర్శలు వచ్చినా కానీ మంత్రి గారిని మాత్రం ఏమీ అనరు.

పరిశుభ్రతకు ఆదర్శంగా ఉండాల్సిన ఏపీ వైద్య శాఖ విఫలమైంది. స్వయంగా వైద్య శాఖ మంత్రి ఈ మాట అంటున్నారు. ఎప్పుడూ ప‌ర్యట‌న‌ల హడావుడి, ఆక‌స్మిక త‌నిఖీలంటూ వార్తల్లో నిలిచే ఏపీ వైద్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు కీల‌క వ్యాఖ్యలు చేసి మ‌రోమారు సెంట‌ర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యారు. ఏ మంత్రయినా త‌న శాఖ‌లో ప‌నితీరు అద్భుతం అమోఘం అని చెప్పుకుంటారు. కానీ కామినేని రూటే సెప‌రేటు. మంత్రిగా బాధ్యత‌లు స్వీక‌రించిన‌ప్పుడు ఏ మాట‌లు చెప్పారో స‌రిగ్గా పాల‌న ఏడాదిన్నర కాలం పూర్తవుతున్నా అదే ప‌ల్లవి అందుకున్నారు. త‌న శాఖ ప‌రిస్థితి దారుణంగా ఉంద‌ని, నిర్లక్ష్యానికి గుర‌వుతోంద‌ని, ప్రక్షాళ‌న చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని కామినేని వ్యాఖ్యానించారు. మంత్రిగా బాధ్యత‌లు స్వీక‌రించి ఏడాదిన్నర కాలంలో కామినేని ఏం ఒరగ‌బెట్టార‌నే సందేహాలు ఇప్పుడు అంద‌రిలో నెల‌కొన్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chandrababu  Kamineni Srinivas  Health MInister  Health Department  AP  Guntur  

Other Articles