100 Families in This Village Bring in Just One Ganpati Idol for Celebrations Since 55 Years

One ganpati idol for one village

Ganesh, Lord Ganapati, Mumbai, One Ganesh for one village, ganesh chaturthi

The residents of Agroli village in Navi Mumbai have been practicing a very unique tradition since the past 55 years. Ganesh Chaturthi celebrations in this village are marked by an extraordinary rule that every family abides by, and is happy to follow. They celebrate the festival with the concept of ‘One village, one Ganpati’.

ఆ ఊర్లో ఒక్క వినాయక విగ్రహం మాత్రమే ఎందుకంటే..

Posted: 09/22/2015 12:35 PM IST
One ganpati idol for one village

లంబోదరుడు.. వినాయకుడు.. గణపతి.. విఘ్ననాయకుడు ఇలా ఎన్నో పేర్లతో ఎంతో మంది పిలిచే గణనాథుడి పండగ సందడి దేశం మొత్తం మొదలైంది. ప్రతిఊర్లో ప్రతి వీధిలో ఒక్కో గణపతి కొలువై ఉన్నాడు. ప్తరి రోడ్డులకు మూడు నాలుగు మంటసపాలు కనిపిస్తున్నాయి. ఆదిదేవుడిని కొలవడానికి అందరూ.. ముందుంటారు అందుకే ప్రతి చోటా గణపతి మంటపాలు వెలిశాయి. అయితే ఓ ఊర్లో మాత్రం ఊరి మొత్తానికి ఒకే గణపతి మంటపం ఉంటుంది. అది కూడా సామూహిక మంటపం.. అక్కడికే అందరూ వచ్చి సామాహికంగా పూజలు నిర్వహిస్తారు. అయితే ఇలా ఊరి మొత్తానికి ఒకే గణపతి దేవుడిని ప్రతిష్టించడానికి మంచి కారణం కూడా ఉంది. అయితే ఇలా ఊరి మొత్తానికి ఒకే వినాయకుడిని ఏర్పాటు చేసుకోవడం ఇప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు.. ఎంతో కాలంగా ఆనవాయితిగా వస్తున్న సంప్రదాయం.

వసుధైర కుటుంబం అనే పదానికి నిలువెత్తు నిదర్శనంగా.. అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది కొత్త ముంబై లోని ఆగ్రోలి విలేజ్.  చవితి ఉత్సవాల్లో ఊరంతకీ ఒకే వినాయకుడ్ని పెట్టే సంప్రదాయాన్ని గత 55 సంవత్సరాలుగా కొనసాగిస్తున్నారు. ' వన్ విలేజ్, వన్ గణపతి' కాన్సెప్టు ఫాలో అవుతూ ఏళ్ళ తరబడి ఎకో ఫ్రెడ్లీ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. సుమారు వంద కుటుంబాలున్న గ్రామంలో వాతావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు అంతా ఒక్క మాటను ఆచరిస్తూ... ఒక్కతాటిపై నడుస్తున్నారు. 1961 సంవత్సరంలో గ్రామస్థుడైన భూ శఖరం పాటిల్ ఈ సంప్రదాయాన్ని ప్రారంభించారు. అప్పట్నుంచీ  ఆగ్రోలి సార్వజనిక్ గణేషోత్సవ్ మండల్ ఆధ్వర్యంలో గ్రామానికంతటికీ  గ్రామస్థులు ఒకే ఒక్క గణపతి విగ్రహాన్నిస్థాపించి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.చవితికి తమ తమ ఇళ్ళలో వినాయకుడ్ని నిలబెట్టే ఆచారాన్ని కొనసాగించడంకోసం కొందరు అప్పులు తెచ్చుకోవడం, తిరిగి తీర్చలేకపోవడాన్ని గమనించిన అప్పటి ఉప్పు కార్మికుల నాయకుడైన భూ శఖరం గ్రామంలో అనవసరమైన ఖర్చును తగ్గించేందుకు..ఈ నిర్ణయం తీసుకున్నారు.  ఇలాంటి నిర్ణయం తీసుకున్న అతడికి, అతడి మాటకు కట్టుబడి సంప్రదాయాన్ని కొనసాగిస్తున్న ఆ గ్రామవాసులకు సెల్యూట్ చేస్తున్నాం.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ganesh  Lord Ganapati  Mumbai  One Ganesh for one village  ganesh chaturthi  

Other Articles