Mumbai Local Court Increase Custody Of Indrani Mukherjea, Sanjeev Khanna, Driver Shyam In Sheena Bora Case

Sheena bora murder case accused custody increase mumbai local court

sheena bora case, sheena bora murder case, police custody, indrani mukherjea, indrani latest updates, indrani mukherjea murder case, sanjeev khanna, driver shyam rai

Sheena Bora Murder Case Accused Custody Increase Mumbai Local Court : Mumbai Local Court Increase Custody Of Indrani Mukherjea, Sanjeev Khanna, Driver Shyam In Sheena Bora Murder Case.

షీనాబోరా హత్య కేసులో నిందితులకు కోర్టు ఝలక్

Posted: 09/21/2015 05:44 PM IST
Sheena bora murder case accused custody increase mumbai local court

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనాబోరా హత్య కేసు థ్రిల్లర్ సినిమాల్లోలాగే ఎన్నో ట్విస్టుల మీద ట్విస్టులతో కొనసాగుతోంది. ఈ కేసు సమస్య రానురాను ముదిరి పాకాప పడుతుందే తప్ప.. చివరి దశకు చేరుకోవడం లేదు. దీంతో విచారణలో భాగంగా నిందితులకు కస్టడీ మరింత పెరుగుతూనే వుంది. అటు పోలీసులకు అంతు చిక్కని ఈ కేసు విచారణకు చివరకు మహారాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి ఇటీవల బదిలీ చేసింది కూడా!

ఇక ప్రధాన నిందితులైన షీనా తల్లి ఇంద్రాణి ముఖర్జియా, ఆమె మాజీ భర్త సంజీవ్ ఖన్నా, డ్రైవర్ శ్యాంరాయ్ ముగ్గురూ.. ఈ హత్య కేసును పక్కదోవ పట్టించేందుకు, తమను తాము రక్షించేందుకు ఎన్నో కథనాలు వినిపిస్తూనే వున్నారు. ఆమధ్య షీనా తన కూతురే కాదని ఓసారి, ఆమె చనిపోలేదని మరోసారి వెల్లడిస్తూ పోలీసులను తికమక పట్టించేందుకు ప్రయత్నాలు చేసింది. కానీ.. అవన్నీ అబద్ధాలేనని పోలీసులు ఎలాగోలా పసిగట్టేశారు. ఇక షీనాని హతమార్చిన స్థలంలో విచారణ చేసి, ఆమె మృతదేహానికి సంబంధించిన ఎముకల్ని సేకరించారు. వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్ కు తరలించగా.. వాటి డీఎన్ఏ, ఇంద్రాణికి మ్యాచ్ అవడంతో వారిరువురూ తల్లికూతుళ్లేనని తేలింది. కానీ.. ఇంద్రాణి విచారణలో రోజుకో కథ అల్లడంతో వారి కస్టడీని మరింత పొడిగించాలని డిమాండ్ చేస్తూ వచ్చారు. ఇలా ఎన్నోసార్లు వారి కస్టడీ పెరుగగా.. తాజాగా మరోసారి వారి కస్టడీని పొడిగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

గతకొన్నాళ్ల నుంచి షీనాబోరా కేసులో పోలీసులు ప్రధాన నిందితుల్ని విచారిస్తూ వస్తున్నారు. సోమవారంతో వారి కస్టడీ ముగియడంతో కోర్టు ముందు వారిని ప్రవేశపెట్టారు. నిందితుల కస్టడీని మరింత పెంచాల్సిందిగా పోలీసులు కోరగా.. అక్టోబర్ 5వ తేదీన వరకు ముంబైలోని స్థానిక కోర్టు కస్టడీ విధించింది. ఈసారి కస్టడీ నుంచి తమకు విముక్తి లభిస్తుందని ఆశించిన ముగ్గురి నిందితులకు మరోమారు కోర్టు ఝలకిచ్చింది. ఈ కేసు చివరి దశకు ఎప్పుడెప్పుడు చేరుకుంటుందా? అని సర్వత్రా ఆసక్తి నెలకొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sheena bora murder case  indrani mukherjea  sanjeev khanna  

Other Articles