Police arrested hardik patel in surat

Police arrested hardik patel in surat

hardik Patel, Gujarat, patel, Protest, Reservations, Rajasthan, Hardik Patel News

Police arrested hardik patel in surat. Gujarat Patel leader hardik patel arrested in Surat in this morning. Hardik tried to start a rally in Surat.

సూరత్ లో హార్దిక్ పాటిల్ అరెస్ట్

Posted: 09/19/2015 11:38 AM IST
Police arrested hardik patel in surat

గుజరాత్ లో పటేళ్ల ఉద్యమానికి నాయకత్వం వహిస్తూ.. దేశంలో సంచలనంగా నిలిచిన హార్దిక్ పాటిల్ ను తాజాగా పోలీసులు అరెస్టు చేశారు. సూరత్ లో హార్దిక్ పాటిల్ తో పాటు దాదాపు మరో 78 మందిని సూరత్ పోలీసులు అరెస్టు చేశారు. సూరత్ లో పటేదార్ అనామత్ ఆందోళన్ సమితి ఆధ్వర్యంలో నిర్వహించతలపెట్టిన ర్యాలీకి ముందు పోలీసులు అరెస్టు చేశారు. సర్దార్ వల్లాభాయ్ పటేల్ విగ్రహానికి పూలమాల వేసి.. నివాళి అర్పించిన తర్వాత హార్దిక్ పాటిల్ ఏక్తాయాత్ర పేరుతో ఓ యాత్రను ప్రారంభించాలని అనుకున్నారు... కానీ అంతలోనే పోలీసులు అరెస్టు చేయడం.. ఉద్రిక్తతకు దారి తీసింది.

Also Read: హార్దిక్ పాటిల్ ను నడిపిస్తున్న ఆ మూడక్షరాలు..!

ఒక్క గుజరాత్ లోనే కాదు మధ్యప్రదేశ్, ఒరిస్సా, బీహార్, రాజస్థాన్ లాంటి 14 రాష్ట్రాలలో తన కార్యక్రమాలను విస్తరించాలని హార్దిక్ ప్రణాళిక రచించారు. పటేల్ సామాజిక వర్గానికి కూడా ఒబీసీ రిజర్వేషన్ కల్పించాలని.. ఒక్క పటేల్ సామాజిక వర్గానికి చెందిన వారికే కాకుండా ఆర్థికంగా వెనుకబడిన ఉన్నత వర్గానికి చెందిన వారికి రిజర్వేషన్ లు కల్పించాలని హార్దిక్ పాటిల్ డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే బ్యాంకుల్లో పటేల్ సామాజిక వర్గానికి చెందిన వాళ్లు ఎలాంటి లావాదేవీలు జరపకూడదు అంటూ పిలుపునిచ్చారు. గుజరాత్ లో చాలా చోట్ల సభలు ఏర్పాటు చేసిన హార్దిక్ పాటిల్ ను తాజాగా పోలీసులు అరెస్టు చెయ్యడంతో ఉద్రిక్తత తలెత్తింది. మరి ఏం జరగబోతోందో చూడాలి.

Also Read: గుజరాత్ హీరోగా మారిన హార్దిక్ పాటిల్

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : hardik Patel  Gujarat  patel  Protest  Reservations  Rajasthan  Hardik Patel News  

Other Articles